
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 165


'ఆచార్య' వచ్చేది అప్పుడేనట..!

త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న #NC 20
చిత్రసీమ లో 15 సంవత్సరాలు పూర్తి

#VT 10 మూవీ లో విలన్ గా నవీన్ చంద్ర
అల్లు అర్జున్ పై బాలీవుడ్ స్టార్ హీరో ప్రశంసలు
రామ్ చరణ్ తో కొరటాల శివ తదుపరి చిత్రం?
ఒకే నెలలో 'అక్కినేని బ్రదర్స్' సందడి
`ప్రభాస్ 21`... ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్
మరోసారి సూర్య డబుల్ ధమాకా
న్యాచురల్ స్టార్ చేతుల మీదుగా 'నిశ్శబ్దం' ట్రైలర్

'భీష్మ' 10 డేస్ కలెక్షన్స్..!
'కృష్ణమనోహర్ ఐపీఎస్' రిలీజ్ డేట్ ఫిక్స్

హీరో నాని ప్రకటించిన "HIT" మూవీ సీక్వెల్

'అహం బ్రహ్మస్మి' ఫస్ట్ లుక్ రిలీజ్
ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకొని మళ్ళీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరో గా 'అహం బ్రహ్మస్మి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
చిన్న సినిమా ( ఓ పిట్టకథ ) కు ప్రభాస్ పెద్ద సపోర్ట్
భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చెందు ముద్దు దర్శకత్వంలో సంజయ్ రావు, విశ్వంత్, నిత్యా శెట్టి , బ్రహ్మాజీ ప్రధాన పాత్రలలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఇట్స్ ఏ లాంగ్ స్టోరీ ట్యాగ్ లైన్ తో రూపొందిన అందమైన ప్రేమకథ "ఓ పిట్టకథ" మూవీ 6వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అవుతున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. ఈ మూవీ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'ఆచార్య' వచ్చేది అప్పుడేనట..!
ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను అనుకున్న టైం కే తీసుకురావాలని... తొందరగా సినిమాను ముగించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట. అన్ని పనులు తొందరగా పూర్తి చేసి ఆగస్టు 14 న విడుదల చేయాలని చూస్తున్నారట. ఎట్టి పరిస్థితులలో ఆగస్ట్ 14న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.మరి రీసెంట్ గానే సరిలేరు నీకెవ్వరు సినిమా ఫంక్షన్ లో మన సినిమా 100 రోజులలో పూర్తి చేయాలని చిరంజీవి దర్శకుడు కొరటాల దగ్గర మాట తీసుకున్నారు. అలా చిరంజీవి కోరుకున్నట్లు జరిగితే ఆగస్ట్ మిస్ అయ్యే సమస్యే లేదు.

సుకుమార్-నిఖిల్ మూవీ టైటిల్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు
అర్జున్ సురవరం తర్వాత వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు నిఖిల్. ఇప్పటికే నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమాకు సీక్వెల్ కార్తికేయ2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా తిరుమల తిరుపతి లో పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఇక షూటింగ్ ఉగాది నుంచి మొదలవతుంది. ఫస్ట్ షెడ్యూల్ తిరుపతిలో ప్రారంభిస్తున్నారు.

త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న #NC 20
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "గీత గోవిందం " మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఒక మూవీ రూపొందనుందని అనౌన్స్ అయ్యింది. కొన్ని రోజులుగా ఆ మూవీ సెట్స్ పైకి వెళ్ళదని రూమర్స్ చెలరేగిన విషయం తెలిసిందే. "లవ్ స్టోరీ " మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత నాగచైతన్య #NC 20 మూవీ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.
చిత్రసీమ లో 15 సంవత్సరాలు పూర్తి
అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్న తమన్నా తన 15 ఇయర్స్ సినీ కెరీర్ ను ఈ రోజు తో పూర్తి చేసుకున్నారు. "చాంద్ సా రోషన్ చెహ్రా " మూవీ తో తమన్నా బాలీవుడ్ లో ప్రవేశించారు. ఆ మూవీ 2005 సంవత్సరం మార్చి 4 వ తేదీ రిలీజ్ అయ్యింది. ఆ మూవీ తరువాత తమన్నా "శ్రీ "మూవీ తో టాలీవుడ్, "కేడి" మూవీ తో కోలీవుడ్ లలో ఎంటర్ అయ్యారు.

#VT 10 మూవీ లో విలన్ గా నవీన్ చంద్ర
మెగాప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో బ్లూ వాటర్ క్రియేషన్స్, రినైసెన్స్ పిక్చర్స్ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న #VT 10 మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరి 24 వ తేదీ వైజాగ్ లో ప్రారంభం అయింది. ఈ షూటింగ్ షెడ్యూల్ 25 రోజులపాటు జరుగనుంది. ఈ మూవీ కై బాక్సింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ టోనీ జెఫ్రిన్ వద్ద వరుణ్ తేజ్ ట్రైనింగ్ పొందారు.
అల్లు అర్జున్ పై బాలీవుడ్ స్టార్ హీరో ప్రశంసలు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా హిందీ డబ్బింగ్ మూవీస్ ద్వారా క్రేజ్ ఏర్పడింది. బాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ గా పేరుపొందిన స్టార్ హీరో హృతిక్ రోషన్ అల్లు అర్జున్ డాన్స్ స్కిల్స్ పై ప్రశంసలు కురిపించారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ డాన్స్ స్కిల్స్ గురించి అడిగిన ప్రశ్నకు హృతిక్ రోషన్ మాట్లాడుతూ .. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ ఎనర్జిటిక్, స్ట్రాంగ్, ఇన్ స్పిరేషన్ అంటూ జవాబు ఇచ్చారు.
రామ్ చరణ్ తో కొరటాల శివ తదుపరి చిత్రం?
`మిర్చి`, `శ్రీమంతుడు`, `జనతా గ్యారేజ్`, `భరత్ అనే నేను`.. ఇలా వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్.. మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో `ఆచార్య` పేరిట ఓ సోషల్ డ్రామాని తెరకెక్కిస్తున్నాడు. మెరుపు వేగంతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ఆగస్టులో జనం ముందుకు రానుంది.
ఒకే నెలలో 'అక్కినేని బ్రదర్స్' సందడి
అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్... ఈ వేసవిలో రెండు విభిన్న ప్రేమకథా చిత్రాలతో సందడి చేయనున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న `లవ్ స్టోరి`తో చైతూ పలకరించనుండగా... `బొమ్మరిల్లు` భాస్కర్ తెరకెక్కిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`తో అఖిల్ అభిమానుల ముందుకు రానున్నాడు.
`ప్రభాస్ 21`... ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ ఏడాది చివరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. పాన్ - వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ ఓ సూపర్ హీరోలా కనిపిస్తాడని చెప్పుకుంటున్నారు.
`రెడ్`లో హెబ్బా పటేల్ ప్రత్యేక గీతం
ఎనర్జిటిక్ స్టార్ రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `రెడ్`. తమిళంలో ఘనవిజయం సాధించిన `తడమ్` ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నాడు. ఇందులో రామ్ కి జోడీగా మాళవికా శర్మ, నివేదా పెతురాజ్, అమృతా నాయర్ నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు.
మరోసారి సూర్య డబుల్ ధమాకా
`ఆరు`, `వేల్` (దేవా), `సింగం` సిరీస్ (`యముడు` సిరీస్) తరువాత కోలీవుడ్ స్టార్ సూర్య, మాస్ డైరెక్టర్ హరి కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ లో పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది దీపావళికి థియేటర్లలో సందడి చేయనుంది.
'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ - ఇలాంటి రెస్పాన్స్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్
ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా బులెట్ దిగిందా లేదా.. ఒక్కోసారి రావడం లేట్ అవ్వొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా.. ప్రస్తుతం ఇలాంటి డైలాగ్స్ మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సెట్ అవుతాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితి ని చూస్తుంటే. దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ సినిమా వస్తుండటంతో ఆ ఎఫెక్ట్ మొత్తం... ఈ సినిమాకు ఎంతలా వెయిట్ చేస్తున్నారో ఫస్ట్ లుక్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటేనే అర్ధమవుతుంది. మాములు రెస్పాన్స్ కాదు...ట్విట్టర్ లో ఈ ఫస్ట్ లుక్ కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మరి ఫస్ట్ లుక్కుకే ఇంత రెస్పాన్స్ ఉంటే... మరి ముందు ముందు ఎన్ని రికార్డ్స్ చేస్తాడో వకీల్ సాబ్.
న్యాచురల్ స్టార్ చేతుల మీదుగా 'నిశ్శబ్దం' ట్రైలర్
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో 'నిశ్శబ్దం' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మార్చి 6వ తేదీన ఉదయం 12.12 నిమిషాలకు ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేయనున్నారు…

'భీష్మ' 10 డేస్ కలెక్షన్స్..!
వెంకీ కుడుములు దర్శకత్వంలో నితిన్-రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా భీష్మ. మహా శివరాత్రి పండుగ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.10 రోజులకు గాను ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల వసూళ్లను మించి సాధించింది. భీష్మకు 26 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరగ్గా ఇప్పుడు దాన్ని క్రాస్ చేసింది చిత్రం. భీష్మ దాదాపు అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. ఇదిలా ఉండగా ఈ వారం పెద్దగా చెప్పుకోవాల్సిన సినిమాలు ఏం లేవు కాబట్టి ఈ సినిమా ఇంకా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.
‘హిట్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..!
ఫలక్‌నుమా దాస్ ఫేం విశ్వక్ సేన్‌తో కలిసి నాని నిర్మించిన సినిమా 'హిట్'. గత నెల 28వ తేదీన రిలీజ్ అయిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అందరినీ ఆకట్టుకొని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక కలెక్షన్స్ విషయంలో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. ఫస్ట్ వీకెండ్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దూసుకుపోయిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3.57 కోట్ల షేర్ ను ప్రపంచవ్యాప్తంగా 4 కోట్లకు పైగాకలెక్షన్స్ సాధించింది. హిట్ సినిమాకు వరల్డ్ వైడ్ గా దాదాపు 6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే ఇప్పటీకే సగం రాబట్టగా.. మరో మూడు నాలుగు రోజుల్లో మొత్తం రాబట్టే అవకాశం వుంది.
'కృష్ణమనోహర్ ఐపీఎస్' రిలీజ్ డేట్ ఫిక్స్
ఏసీ ముగిల్ దర్శకత్వంలో ప్రభుదేవా పోలీసు అధికారిగా నటించిన చిత్రం 'పొణ్ మానిక్యవేల్'. ‘పొణ్ మానిక్యవేల్’ సినిమాను తెలుగులో 'కృష్ణమనోహర్ ఐపీఎస్' పేరుతో రిలీజ్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ అప్పుడు రిలీజ్ కాలేదు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను మార్చి 6న విడుదల చేస్తున్నారు.

హీరో నాని ప్రకటించిన "HIT" మూవీ సీక్వెల్
హీరో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మాతలుగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా రూపొందిన థ్రిల్లర్ మూవీ "HIT" 28వ తేదీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కమర్షియల్ గా సక్సెస్ అయింది. మార్చి 2వ తేదీ "HIT" మూవీ సక్సెస్ మీట్ జరిగింది.

ఓ పిట్టకథ మూవీ "ఏమై పోతానే" వీడియో సాంగ్ రిలీజ్
భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చెందు ముద్దు దర్శకత్వంలో సంజయ్ రావు , విశ్వంత్ , నిత్యా శెట్టి ప్రధాన పాత్రలలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఇట్స్ ఏ లాంగ్ స్టోరీ ట్యాగ్ లైన్ తో అందమైన ప్రేమకథ గా రూపొందిన "ఓ పిట్టకథ" మూవీ 6వ తేదీ రిలీజ్ కానుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ ఒక కీలక పాత్రలో నటించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.