
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 166


"ఒరేయ్ బుజ్జిగా" మూవీ టీజర్ రిలీజ్ డేట్

`నేల టిక్కెట్టు` భామతో మాస్ మహారాజా?

చిరు 'లూసిఫర్' బాధ్యత వినాయక్ కు..!

#Prabhas21 మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ?

"మేజర్ " మూవీ లో శోభిత ధూళిపాళ
'కార్తికేయ 2' - చైత్రంలో చిత్రీకరణ
"కార్తికేయ 2" మూవీ కాన్సెప్ట్ వీడియో రిలీజ్
తేజ సినిమాలో 'అలివేలు మంగ'గా..?
కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం?
`శ్యామ్ సింగ రాయ్`కి ఎ.ఆర్. రెహమాన్ బాణీలు?
నేటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో `యన్.బి.కె. 106`

తమిళ మూవీ లో విలన్ గా నవదీప్
`మెగాస్టార్ 152`... టైటిల్ ప్రకటించిన చిరు

వరుస హిట్స్.. భిన్నమైన కథలతో దూసుకుపోతున్న 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ'
సినీ పరిశ్రమలో లక్ అనేది అందరికీ కలిసి రాదు. అలా అని కేవలం లక్ మాత్రమే ఉంటే సరిపోదు కదా. హార్డ్ వర్క్ ఉండాలి.. దానికి తోడు కొంచెం లక్ ఉంటే చాలు సక్సెస్ అయినట్టే. అలా మంచి నిర్మాణ విలువలతో తక్కువ కాలంలోనే మంచి మంచి కాంబినేషన్స్ తో సినిమాలు చేసి తమ ఉనికిని గట్టిగా చాటుకుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా వైవిధ్యమైన కథా చిత్రాలను నిర్మిస్తూ…విజయాలు సాధిస్తూ..అటు ఆడియన్స్ లోను, ఇటు ఇండస్ట్రీలోను అనతి కాలంలోనే ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. ఇప్పటికే ఎంఎల్ఏ, వైఫ్ ఆఫ్ రామ్, గూఢచారి, లాంటి వైవిధ్యమైన, విజయవంతమైన చిత్రాలు నిర్మించి…

"ఒరేయ్ బుజ్జిగా" మూవీ టీజర్ రిలీజ్ డేట్
సూపర్ హిట్ మూవీస్ "గుండె జారి గల్లంతయ్యిందే", "ఒక లైలా కోసం "ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ , మాళవిక నాయర్ జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఒరేయ్ బుజ్జిగా" మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. హీరోయిన్ హెబ్బా పటేల్ ఒక కీలక పాత్రలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

`నేల టిక్కెట్టు` భామతో మాస్ మహారాజా?
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి `క్రాక్` కాగా.. మరొకటి `రాక్షసుడు` ఫేమ్ రమేష్ వర్మ రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్. గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న `క్రాక్` ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. మే 8న జనం ముందుకు రానుంది.
ఉప్పెన 'నీ కన్ను నీలి సముద్రం' పాట రిలీజ్
సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోపక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుండి 'నీ కన్ను నీలి సముద్రం' అంటూ సాగే మొదటి పాట ఫుల్ లిరికల్ సాంగ్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. దేవిశ్రీప్రసాద్ సంగీతానికి శ్రీమణి సాహిత్యం అందించగా, జావేద్ అలీ ఆలపించారు.
పవన్ 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ రిలీజ్
ఫైనల్లీ.. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎదురుచూపులు ఫుల్ స్టాప్ పడింది. పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా చాలా వేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాకు టైటిల్ ను 'వకీల్ సాబ్' అనుకుంటున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి విదితమే. ఇప్పుడు ఆ వార్తలకు బ్రేక్ వేస్తూ టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మొదటినుండి అనుకున్నట్టే ఈ సినిమాకు 'వకీల్ సాబ్' టైటిల్ నే ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఓ పుస్తకం చదువుతూ ఓ కుర్చీలో కూర్చుని ఉన్న పవన్, తిరగేసిన మరో…

చిరు 'లూసిఫర్' బాధ్యత వినాయక్ కు..!
పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకుడిగా మలయాళంలో గత ఏడాది మార్చిలో వచ్చిన 'లూసిఫర్' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రైట్స్ రామ్ చరణ్ సొంతం చేసుకొని.. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిరు ప్రధాన పాత్రలో చరణ్ ఈ సినిమాను నిర్మించనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే హక్కులు సొంతం చేసుకున్నాడు కానీ అప్పటినుండీ.. ఈ సినిమా డైరెక్టర్, హీరో విషయంలో మాత్రం చరణ్ ఓ నిర్ణయానికి రాలేకపోయాడు. ఇక ఇన్ని రోజులు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు.

"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలుగా గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజ హెగ్డే జంటగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీ రూపొందుతుంది. ఆమని, మురళీశర్మ, వెన్నెల కిషోర్, ఈషా రెబ్బా, జయప్రకాష్, ప్రగతి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందించారు.

#Prabhas21 మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ?
గోపీకృష్ణా మూవీస్, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas 20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. #Prabhas 20 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ మరొక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మెగా ఈవెంట్ లో స్వామి నాయుడుకు మెగాపవర్ స్టార్ అభినందన
నిన్న జరిగిన "మెగాస్టార్ ద లెజెండ్" పుస్తకావిష్కరణ సభలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ' అఖిలభారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ అయిన స్వామి నాయుడు గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ "అభిమానులకు మా కుటుంబానికి మధ్య సంధాన కర్తగా, బ్లడ్ బ్యాంక్ మేనేజర్ గా అంకితభావంతో పనిచేస్తున్న స్వామి నాయుడుకు కృతజ్ఞతలు , అభినందనలు" అన్నప్పుడు అభిమానుల హర్షధ్వానాలు మిన్నంటాయి. అలాంటి మెగా ఈవెంట్ లో రామ్ చరణ్ ప్రత్యేకంగా తన పేరు ప్రస్తావిస్తూ అభినందించడంతో స్వామి నాయుడు ఆనందంతో పులకించిపోయారు. అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఉదయం రామ్ చరణ్ కు ఒక 'థాంక్స్ గివింగ్ మెసేజ్…
బాలకృష్ణ - బోయపాటి సినిమా షూటింగ్ ప్రారంభం
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ 'సింహా', 'లెజెండ్' తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. రామ్ లక్ష్మణ్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ తో షూటింగును మొదలెట్టారు. తొలి షెడ్యూల్లోనే యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. గ్రహాలు .. ప్రభావం ఒక కోణంగా, అఘోర పాత్ర మరో కోణంగా ఈ సినిమా సాగుతుందని అంటున్నారు.

"మేజర్ " మూవీ లో శోభిత ధూళిపాళ
సోనీ పిక్చర్స్ ఎంటర్ టైన్ మెంట్స్, ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై 26/11 ముంబై ఉగ్రవాదుల దాడిలో ప్రాణం కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా సక్సెస్ ఫుల్ "గూఢచారి " మూవీ ఫేమ్ శశి కిరణ్ దర్శకత్వంలో యంగ్ హీరో అడివి శేష్ కథా నాయకుడు గా తెలుగు, హిందీ భాషలలో "మేజర్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
'కార్తికేయ 2' - చైత్రంలో చిత్రీకరణ
నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇన్నిరోజులు కేవలం వార్తల్లోనే నిలిచిన ఈ సినిమా ఫైనల్ గా సెట్స్ పైకి వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ సినిమాను తిరుమల తిరుపతి లో పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక ఈ చిత్రం చిత్రకరణ ఉగాది నుంచి మొదలవతుంది. ఫస్ట్ షెడ్యూల్ తిరుపతిలో ప్రారంభిస్తున్నారు.
"కార్తికేయ 2" మూవీ కాన్సెప్ట్ వీడియో రిలీజ్
చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ "కార్తికేయ " మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు "కార్తికేయ " మూవీ కి సీక్వెల్ "కార్తికేయ2 " మూవీ రూపొందనుంది. "కార్తికేయ " మూవీ ద్వారా చందు మొండేటి దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో "కార్తికేయ2 " మూవీ తెరకెక్కనుంది.
తేజ సినిమాలో 'అలివేలు మంగ'గా..?
'నేనే రాజు నేనే మంత్రి' సినిమా హిట్ తో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు తేజ. ఇప్పుడు వరుసగా రెండు సినిమాలతో వస్తున్నాడు. అందులో ఒకటి . ‘అలివేలుమంగ వెంకటరమణ’ కాగా మరోటి ‘రాక్షసరాజు రావణాసురుడు’. ఈ రెండు చిత్రాలలో ఒక చిత్రంలో రానా నటిస్తుండగా మరో చిత్రంలో గోపి చంద్ నటించనున్నాడు. ఈ సినిమాలకు సంబంధించిన మరిన్ని త్వరలో వెల్లడించనున్నారు.
కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం?
ఈ ఏడాది సంక్రాంతికి `ఎంత మంచివాడవురా`తో సందడి చేశాడు నందమూరి కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ స్టార్ నూతన దర్శకుడు మల్లిడి వేణు దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
`శ్యామ్ సింగ రాయ్`కి ఎ.ఆర్. రెహమాన్ బాణీలు?
నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్ లో `శ్యామ్ సింగ రాయ్` పేరుతో ఓ భారీ బడ్జెట్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించనుంది. ఇందులో నాని మూడు విభిన్న పాత్రల్లో దర్శనమిస్తాడని... అతనికి జోడీగా సాయిపల్లవి, రష్మికా మందన్న నాయికలుగా నటిస్తారని ప్రచారం సాగుతోంది.
నేటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో `యన్.బి.కె. 106`
నటసింహ బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన `సింహా`, `లెజెండ్` సంచలన విజయం సాధించాయి. సుదీర్ఘ విరామం అనంతరం... ఈ ఇరువురు ఓ డివోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం జట్టుకట్టారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత సంచలనం థమన్ స్వరాలు సమకూర్చుతున్నాడు.

తమిళ మూవీ లో విలన్ గా నవదీప్
"జై " మూవీ తో నవదీప్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. నవదీప్ నటించిన గౌతమ్ SSC , చందమామ, ఆర్య 2, ధృవ, నేనేరాజు నేనే మంత్రి, అల .. వైకుంఠపురములో .. మూవీస్ ఘనవిజయం సాధించాయి. నవదీప్ కొన్ని తమిళ మూవీస్ లో కూడా నటించారు. నవదీప్ ఇప్పుడు ఒక కొత్త అవతారం ఎత్తారు. ఒక తమిళ మూవీ లో ప్రతినాయకుడిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
`మెగాస్టార్ 152`... టైటిల్ ప్రకటించిన చిరు
మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సోషల్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు.

`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` రిలీజ్ డేట్ ఫిక్సయిందా?
అక్కినేని యంగ్ హీరో అఖిల్... త్వరలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`గా పలకరించబోతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి `బొమ్మరిల్లు` భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీసుందర్ బాణీలు అందిస్తున్నాడు.