సుకుమార్-నిఖిల్ మూవీ టైటిల్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు

Muhurtham Fixed For Title Release Of Sukumar Nikhil New Movie,latest telugu movies news,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Sukumar Nikhil New Movie,Sukumar Nikhil New Movie Title,Nikhil Latest News 2020,Nikhil Upcoming Movie Details

అర్జున్ సురవరం తర్వాత వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు నిఖిల్. ఇప్పటికే నిఖిల్‌, చందు మెుండేటి కాంబినేష‌న్ లో వచ్చిన ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్ కార్తికేయ2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా తిరుమ‌ల తిరుప‌తి లో పూజాకార్య‌క్ర‌మాల‌తో లాంఛనంగా ప్రారంభించారు. ఇక షూటింగ్ ఉగాది నుంచి మొదలవతుంది. ఫస్ట్ షెడ్యూల్ తిరుపతిలో ప్రారంభిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో సినిమాకు సంబంధించి అప్ డేట్ వచ్చేసింది. ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా టైటిల్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. రేపు ఉదయం (మర్చి 5) 9 గంటలకు ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు.

కాగా సుకుమార్ మరియు అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాకు సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. మరి ఈ సినిమాలో నిఖిల్ సరసన నటించే హీరోయిన్, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.