యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ ఏడాది చివరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. పాన్ – వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ ఓ సూపర్ హీరోలా కనిపిస్తాడని చెప్పుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ఇదిలా ఉంటే… ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీగా రూపొందనున్న `ప్రభాస్ 21`కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ తెలిసింది. అదేమిటంటే… ఈ సినిమా `మూడో ప్రపంచ యుద్ధం వస్తే పరిస్థితి ఏంట`నే కోణంలో సాగుతుందట. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటాయని వినికిడి. మరి.. ఈ కథనాల్లో ఎంత నిజముందో తెలియాలంటే వచ్చే ఏడాది చివరి వరకు వేచిచూడాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























