ఎనర్జిటిక్ స్టార్ రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `రెడ్`. తమిళంలో ఘనవిజయం సాధించిన `తడమ్` ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నాడు. ఇందులో రామ్ కి జోడీగా మాళవికా శర్మ, నివేదా పెతురాజ్, అమృతా నాయర్ నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకి సంబంధించి ఒకే ఒక పాట చిత్రీకరణ మిగిలి ఉంది. ప్రస్తుతం ఆ గీతాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో తీర్చిదిద్దిన ప్రత్యేక సెట్ లో చిత్రీకరిస్తున్నారు. ఇందులో అందాల తార హెబ్బా పటేల్ తళుక్కున మెరవనుంది. ఐదు రోజుల పాటు రాత్రివేళల్లోనే ఈ పాటని చిత్రీకరిస్తారని సమాచారం. మంగళవారం రాత్రి ప్రారంభమైన ఈ స్పెషల్ సాంగ్ శనివారం రాత్రితో పూర్తి కానుంది. జానీ నృత్యాలు సమకూర్చుతున్న ఈ గీతం… `రెడ్`కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
కాగా, `రెడ్` ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: