
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 164


సాయితేజ్ కి జంటగా నివేదా పెతురాజ్?

ప్రభాస్ కి జోడీగా కత్రినా కైఫ్?
'ఒరేయ్ బుజ్జిగా' - ఈ మాయ పేరేమిటో సాంగ్ టీజర్ రిలీజ్

తొందరగానే పని కానిచ్చేసిన 'వకీల్ సాబ్'

"ఒరేయ్ బుజ్జిగా" మూవీ మొబైల్ పబ్లిసిటీ

హోళీ సంబరాల్లో ఎన్టీఆర్..!

15 ఇయర్స్ ఆఫ్ అనుష్క ఈవెంట్ డేట్

#Prabhas 20 మూవీ అప్ డేట్

మే నుంచి బాలకృష్ణ, బి. గోపాల్ చిత్రం?

చిన్న చిత్రానికి స్టార్ డైరెక్టర్ స్క్రిప్ట్ ?

ప్రయోగాత్మక చిత్రం లో నాని ?

డేట్ ఫిక్స్ చేసుకున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చిత్రం?
పోయినేడాది `రాక్షసుడు`తో అలరించిన యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్... ప్రస్తుతం `కందిరీగ` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. `ఇస్మార్ట్ శంకర్` భామ నభా నటేష్, `అజ్ఞాతవాసి` భామ అను ఇమ్మాన్యుయేల్ నాయికలుగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.

సాయితేజ్ కి జంటగా నివేదా పెతురాజ్?
గత ఏడాది `చిత్రలహరి`, `ప్రతి రోజూ పండగే` రూపంలొ రెండు వరుస విజయాలు అందుకున్నాడు `సుప్రీమ్` హీరో సాయితేజ్. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న `సోలో బ్రతుకే సో బెటర్`తో ఈ మెగా కాంపౌండ్ హీరో బిజీగా ఉన్నాడు. నూతన దర్శకుడు సుబ్బు రూపొందిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రభాస్ కి జోడీగా కత్రినా కైఫ్?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ ఏడాది చివరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. వచ్చే సంవత్సరం చివరలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
'ఒరేయ్ బుజ్జిగా' - ఈ మాయ పేరేమిటో సాంగ్ టీజర్ రిలీజ్
విజయ్‌కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'ఒరేయ్.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానున్న నేపథ్యంలో... ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్, ఇటీవలే మొదటి పాట .. ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున, మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. రీసెంట్ గా టీజర్ ను కూడా రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మరో…

తొందరగానే పని కానిచ్చేసిన 'వకీల్ సాబ్'
పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ 'వకీల్ సాబ్' చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఈ సినిమా చాలా వేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరోపక్క సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇక ఈ సినిమా టైటిల్ ను ఇటీవలే రిలీజ్ చేయగా దానికి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ట్విట్టర్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని స్త్రీ గొప్పతనాన్ని చాటేలా ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కనవా అనే పాటను కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు టీజర్ ను ఉగాది సందర్భంగా మార్చి 25న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు…

"ఒరేయ్ బుజ్జిగా" మూవీ మొబైల్ పబ్లిసిటీ
శ్రీమతి లక్ష్మీరాధామోహన్ సమర్పణలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "ఒరేయ్ బుజ్జిగా" మూవీ ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. హెబ్బా పటేల్, వాణి విశ్వనాధ్, నరేష్, పోసాని, సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

హోళీ సంబరాల్లో ఎన్టీఆర్..!
బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ మొదలు పెట్టని రాజమౌళి మరి కొద్ది రోజులలో ఫస్ట్ లుక్‌తో పాటు చిత్ర టైటిల్ అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం.

15 ఇయర్స్ ఆఫ్ అనుష్క ఈవెంట్ డేట్
కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధానపాత్ర లో రూపొందిన థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్ధం" ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. పూర్తిగా US లో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ లో మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. "నిశ్శబ్ధం" మూవీ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది.
'వి' నుండి 'వస్తున్నా..వచ్చేస్తున్నా' పాట విడుదల
ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'V'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు.ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేయగా...తాజాగా మరో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ రోజు వి మూవీలోని 'వస్తున్నా.. వచ్చేస్తున్నా' లిరికల్ వీడియో విడుదల చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించిన ఈపాటను శ్రేయ ఘోషల్, అమిత్ త్రివేది, అనురాగ్ కులకర్ణి కలిసి పాడారు.
ఉప్పెన 'ధక్..ధక్..ధక్' సాంగ్ రిలీజ్
సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోపక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఒక్కోటి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మొదటి పాటగా విడుదల చేసిన నీ కన్ను నీలి సముద్రం అనే పాట ఇప్పటికే పది మిలియన్ల వ్యూస్ దక్కించుకుని యూ ట్యూబ్ ని షేక్ చేస్తోంది.చాలా రోజుల తరువాత దేవిశ్రీ ప్రసాద్ మార్క్‌కి తగ్గ సాంగ్ వచ్చింది. ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. ‘ధక్ ధక్ ధక్’ అనే పాటను రిలీజ్ చేశారు. నువ్వూ…

#Prabhas 20 మూవీ అప్ డేట్
గోపీకృష్ణా మూవీస్, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas 20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ "మైనే ప్యార్ కియా "మూవీ ఫేమ్ భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు.

13వ తేదీ రిలీజ్ కానున్న 6 చిత్రాలు
ప్రతీ శుక్రవారం రిలీజయ్యే మూవీస్ విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు 13 వ తేదీ శుక్రవారం రిలీజయ్యే 6 సినిమాల గురించి తెలుసుకుందాం.
పవన్ కళ్యాణ్... 1998 నాటి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడా?
వేసవికి విడుదల కాబోతున్న `వకీల్ సాబ్`తో రీ-ఎంట్రీ బాట పట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఇదే ఏడాది మరో సినిమాతో పలకరించబోతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సదరు పిరియాడిక్ ఫిల్మ్ దీపావళి కానుకగా సందడి చేయనుందని సమాచారం. సో... 2020లో పవన్ డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడన్నమాట.

చిరంజీవి, రెజీనా.. ఓ సెలబ్రేషన్ సాంగ్
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `ఆచార్య`. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ మెరుపు వేగంతో జరుగుతోంది.
హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో.. రానా `విరాటపర్వం`
రానా, సాయిపల్లవి జంటగా `విరాటపర్వం` పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. `నీదీ నాదీ ఒకే కథ` ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తుది దశకు చేరుకున్న ఈ సినిమాకి సంబంధించిన చివరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. కాగా, పిరియాడిక్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హాలీవుడ్ కెమెరామ్యాన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తుండగా... హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ స్టీఫెన్ రిచెర్ పోరాటఘట్టాలకు యాక్షన్ కొరియోగ్రఫీ సమకూర్చుతుండడం…
తెలుగు సంవత్సరాదికి అనూప్ రూబెన్స్ డబుల్ ధమాకా
ఈ తెలుగు సంవత్సరాది `హాఫ్ సెంచరీ క్లబ్` మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ కి వెరీ స్పెషల్ కానుంది. ఎందుకంటే.. ఆ రోజు అనూప్ సంగీతమందించిన రెండు ఆసక్తికరమైన చిత్రాలు తెరపై సందడి చేయనున్నాయి. ఆ సినిమాలే.. `30 రోజుల్లో ప్రేమించటం ఎలా?`, `ఒరేయ్ బుజ్జిగా`. ప్రేమకథా చిత్రాలుగా రూపొందిన ఈ రెండు సినిమాలు కూడా మార్చి 25న థియేటర్లలో సందడి చేయనున్నాయి.

మే నుంచి బాలకృష్ణ, బి. గోపాల్ చిత్రం?
నటసింహ బాలకృష్ణకు అచ్చొచ్చిన దర్శకుల్లో బి.గోపాల్ ఒకరు. `లారీ డ్రైవర్` (1990), `రౌడీ ఇన్స్ పెక్టర్` (1992), `సమరసింహారెడ్డి` (1999), `నరసింహనాయుడు` (2001).. ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో నాలుగు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. వీటిలో `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు` అయితే ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. అయితే ఐదో సినిమాగా వచ్చిన `పలనాటి బ్రహ్మనాయుడు`(2003) మాత్రం నిరాశపరిచింది.

కె 2 కె ప్రొడక్షన్స్ నెం 1 ఫస్ట్ లుక్, టీజర్ గ్లింప్స్ రిలీజ్
మలయాళ చిత్ర పరిశ్రమకు బాలనటిగా పరిచయం అయిన కావేరి కళ్యాణి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల చిత్రాలలో హీరోయిన్ గా నటించారు. "శేషు " మూవీ తో టాలీవుడ్ లో ఎంటర్ అయిన కావేరి "ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు " మూవీ లో అద్భుతంగా నటించి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్ అందుకున్నారు.

చిన్న చిత్రానికి స్టార్ డైరెక్టర్ స్క్రిప్ట్ ?
"అల .. వైకుంఠపురములో .. " మూవీ గ్రాండ్ సక్సెస్ తరువాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒక మూవీ రూపొందించనున్నారని తెలిసిన విషయమే. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "RRR" మూవీ లో తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ కాగానే ఎన్టీఆర్ , త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందే మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.

ప్రయోగాత్మక చిత్రం లో నాని ?
విభిన్న కథా చిత్రాలు ఎంపిక చేసుకుని విజయపథం లో దూసుకుపోతున్న న హీరో నాని ఇప్పుడు ఒక ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని నెగటివ్ రోల్ లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్" మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.