రామ్ చ‌ర‌ణ్ తో కొర‌టాల శివ త‌దుప‌రి చిత్రం?

Koratala Siva Plans His Next With Ram Charan,latest telugu movies news,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Koratala Siva,Director Koratala Siva,Director Koratala Siva Next With Ram Charan,Ram Charan New Movie with Koratala Siva,Ram Charan

`మిర్చి`, `శ్రీ‌మంతుడు`, `జ‌న‌తా గ్యారేజ్`, `భ‌ర‌త్ అనే నేను`.. ఇలా వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్నాడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. ప్ర‌స్తుతం ఈ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్.. మెగాస్టార్ చిరంజీవి కాంబినేష‌న్ లో `ఆచార్య‌` పేరిట ఓ సోష‌ల్ డ్రామాని తెర‌కెక్కిస్తున్నాడు. మెరుపు వేగంతో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ఆగ‌స్టులో జ‌నం ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే.. ఈ సినిమా త‌రువాత మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో త‌న నెక్స్ట్ వెంచ‌ర్ ని ప్లాన్ చేస్తున్నాడ‌ట శివ‌. అంతేకాదు.. ఈ చిత్రాన్ని త‌న మిత్రుడు మిక్కిలినేని సుధాక‌ర్ తో క‌ల‌సి యువ సుధ ఆర్ట్స్ ప‌తాకంపై నిర్మిస్తాడ‌ని అంటున్నారు. అలాగే వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి ఈ భారీ బ‌డ్జెట్ మూవీ సెట్స్ పైకి వెళుతుంద‌ట‌.

వాస్త‌వానికి… 2013లోనే చ‌ర‌ణ్ తో శివ ఓ చిత్రాన్ని ప్లాన్ చేశాడు. అయితే, పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న‌ప్ప‌టికీ.. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా ఆగిపోయింది. మొత్తానికి ఎనిమిదేళ్ళ త‌రువాత ఈ కాంబోలో ప్రాజెక్ట్ సెట్ కానుండ‌డం ఆస‌క్తిక‌ర‌మ‌నే చెప్పాలి. త్వ‌ర‌లోనే చెర్రీ, కొర‌టాల కాంబో మూవీపై ఫుల్ క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.