హిందీ బాట పడుతున్న `వరల్డ్ ఫేమస్ లవర్`?
Vijay Deverakonda World Famous Lover Goes To Bollywood

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ మూడు విభిన్న పాత్రల్లో నటించిన చిత్రం `వరల్డ్ ఫేమస్ లవర్`. సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ రూపొందించిన ఈ సినిమాలో విజయ్ కి జోడీగా రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లి లిటే నాయికలుగా నటించారు. గోపీసుందర్ సంగీతమందించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మించింది. వేలంటైన్స్ డే స్పెషల్ గా ఫిబ్రవరి 14న రిలీజైన ఈ ప్రేమకథా చిత్రం... కంటెంట్ విషయంలో ఓకే అనిపించుకున్నా, ఎగ్జిక్యూషన్ విషయంలో పూర్ మార్క్స్ తెచ్చుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిందీ సినిమా.
కట్ చేస్తే... ఇప్పుడీ లవ్ స్టోరీ హిందీ బాట పట్టనుందట. ప్రముఖ హిందీ దర్శకనిర్మాత కరణ్ జోహార్.. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఇప్పటికే ఈ మేరకు రీమేక్ రైట్స్ కూడా పొందాడని టాక్. మరి.. హిందీ వెర్షన్ లో అయినా ఈ కథ కాసుల వర్షం కురిపిస్తుందేమో చూడాలి.







