రామ్ తో రాజ‌మౌళి చిత్రం?

Baahubali Director SS Rajamouli To Make A Movie With iSmart Hero Ram Pothineni

తెలుగునాట అప‌జ‌య‌మంటూ ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న 11 చిత్రాలను డైరెక్ట్ చేయ‌గా… ప్ర‌తీ సినిమా విజ‌య‌ఢంకా మ్రోగించింది. ప్ర‌స్తుతం ఈ స్టార్ డైరెక్ట‌ర్.. యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో పేట్రియాటిక్ డ్రామా `ఆర్ ఆర్ ఆర్`ని తెర‌కెక్కిస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… 2021 సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే.. `ఆర్ ఆర్ ఆర్` త‌రువాత రాజ‌మౌళి చేయ‌బోయే చిత్రంపై ఫిల్మ్ న‌గ‌ర్ స‌ర్కిల్స్ లో ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నం ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. `ఇస్మార్ట్` హీరో రామ్ తో జ‌క్క‌న్న నెక్స్ట్ వెంచ‌ర్ ఉంటుంద‌ని స‌మాచారం. ప‌రిమిత బ‌డ్జెట్ లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తిచేసి 2021లోనే రిలీజ్ చేయాల‌న్న ఆలోచ‌న‌తో ఉన్నాడ‌ట రాజ‌మౌళి. ఏదేమైనా, రామ్ – రాజ‌మౌళి కాంబినేష‌న్ మూవీపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + one =