మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా తెరంగేట్రం చేసినా.. అనతి కాలంలోనే నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్. కేవలం మాతృభాషకే పరిమితం కాకుండా తమిళ, తెలుగు, హిందీ భాషల్లోనూ సినిమాలు చేశాడు. తెలుగులో మహానటి సావిత్రి బయోపిక్ `మహానటి`లో జెమినీ గణేషన్ గా నటించి అలరించాడు. ఆపై మళ్ళీ తెలుగులో నేరుగా నటించని దుల్కర్ త్వరలో మరోమారు టాలీవుడ్ బాట పట్టనున్నాడట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు హను రాఘవపూడి.. దుల్కర్ తో ఓ సినిమాని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ మేరకు కథా చర్చలు సాగుతున్నాయని సమాచారం. త్వరలోనే దుల్కర్, హను కాంబినేషన్ మూవీపై క్లారిటీ వస్తుంది. మరి.. తొలి తెలుగు చిత్రం `మహానటి`తో విజయం అందుకున్న దుల్కర్.. సెకండ్ ఫిల్మ్ తోనూ సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: