హిందీలో అమితాబ్ ప్రధాన పాత్రలో తాప్సి కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా పింక్. స్త్రీ స్వేచ్చ, హక్కులపై న్యాయ వ్యవస్థపై ముగ్గురు యువతులు ఎలా పోరాటం చేశారు..వారికి అమితాబ్ ఎలా సాయం అన్నది ఈ సినిమా కథాంశం. ఇక హిందీలో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. తమిళ్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే తమిళ్ లో కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారనుకోండి. తెలుగులో కూడా ఎదో మెసేజ్ ఇచ్చాం అన్నట్టుగా కాకుండా కమర్షియల్ అంశాలు జోడించనున్నారు. అయితే ఒరిజినల్ కథ ఫ్లేవర్ పోకుండా.. మరి ఎక్కువ హీరోయిజం చూపించకుండా… తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కథలో భాగంగానే హీరోని చూపించాలని ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో ఇప్పటీకే నివేదా థామస్,అంజలి ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కు ఎవరు నటిస్తారన్నదానిపై ఇప్పటివరకూ ఒక క్లారిటీ రాలేదు. మొదట శృతి హాసన్ పేరు వినిపించింది. ఆ తర్వాత ఆమె ప్లేస్‌ను ఇలియానాతో రీ ప్లేస్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కాదు లావణ్య త్రిపాఠి అన్న టాక్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు లావణ్యనే తీసుకున్నటు తెలుస్తుంది. ఆమెకు ‘వకీల్ సాబ్’ నుంచి పిలుపు రావడంతో షూటింగ్‌కి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన ఇస్తారేమో చూద్దాం..
కాగా, ‘వకీల్ సాబ్’ సినిమాను బోనీ కపూర్ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఇటీవల ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్, థీం సాంగ్‌ను రిలీజ్ చేయగా వాటికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: