#Prabhas 20 షూటింగ్ షెడ్యూల్ పై దర్శకుడి వివరణ

Prabhas 20 Movie Director KK Radha Krishna Gives Interesting Movie Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Prabhas 20,#Prabhas20,Prabhas 20 Latest News,Prabhas 20 Movie,Prabhas 20 Telugu Movie,Prabhas 20 Movie Updates,Prabhas 20 Telugu Movie Latest News,Director KK Radha Krishna,Director KK Radha Krishna Latest News,Director KK Radha Krishna About Prabhas 20 Movie

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas20 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హైదరాబాద్ లో భారీ సెట్స్ లో చిత్రీకరణ జరుపుకున్న #Prabhas20 మూవీ జార్జియా లో షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ కాలేదని, షూటింగ్ క్యాన్సిల్ అయిందనే రూమర్స్ కు దర్శకుడు రాధాకృష్ణ చెక్ పెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాధాకృష్ణ మాట్లాడుతూ .. జార్జియా లో #Prabhas20 మూవీ షూటింగ్ క్యాన్సిల్ కాలేదని, షూటింగ్ షెడ్యూల్ ప్రకారమే జరిగిందని ఒక ఛేజ్ సీన్, ప్రభాస్ , పూజ హెగ్డే లపై కొన్ని రొమాంటిక్ సీన్స్ తెరకెక్కించానని, కరోనా వైరస్ ప్రభావంతో షెడ్యూల్ ప్రకారం చివరి రెండు రోజులు తగు జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ కంప్లీట్ చేయడానికి టీమ్ శ్రమించారని, దర్శకుడు రాధాకృష్ణ రూమర్స్ ను క్లారిఫై చేశారు. గోపీకృష్ణా మూవీస్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న #Prabhas20 మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఫస్ట్ లుక్ త్వరలోనే రిలీజ్ కానుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =