#Prabhas 20మూవీ అప్ డేట్

Prabhas 20 Team Releases An Interesting Movie Update

గోపీకృష్ణా మూవీస్, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజ హెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas20 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్, భారీ సెట్స్ లో రూపొందుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. జార్జియా లో జరిగిన షూటింగ్ షెడ్యూల్ లో ఒక ఛేజ్ సీన్ ను, ప్రభ, పూజ హెగ్డే లపై కొన్ని రొమాంటిక్ సీన్స్ ను దర్శకుడు తెరకెక్కించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జార్జియా షూటింగ్ షెడ్యూల్ అనుకున్నదానికంటే ముందుగానే కంప్లీట్ అయ్యింది. #Prabhas20 మూవీ జార్జియా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందని, ఈ షూటింగ్ షెడ్యూల్ తొందరగా కంప్లీట్ చేసేందుకు సహకరించిన జార్జియా టీమ్ కు థ్యాంక్స్ అని దర్శకుడు రాధాకృష్ణ ట్వీట్ చేశారు. #Prabhas20 మూవీ మరొక షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగనుంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ మూవీ దసరా పండగ కు రిలీజ్ కానుందని సమాచారం. మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ ఉగాది పండగకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + two =