‘కరోనా’ పై మహేష్ ఇంట్రెస్టింగ్ వీడియో

#Mahesh Babu, Coronavirus outbreak, Covid 19 : Mahesh Babu Shares An Impactful Video And Message To Fans – Urges To Stay Indoors, COVID 19: Mahesh Babu Requests Fans To Stay Indoors, Latest Telugu Movies News, Mahesh Babu About Coronavirus, Mahesh Babu urges fans to take precautions amid coronavirus, Super Star Mahesh Babu Spreads Awareness About Coronavirus With An Interesting Video, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

‘కరోనా’ పై ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ స్పందించి ప్రజలకు పలు సూచనలు చెప్పడంతోపాటు… అనవసరమైన అపోహలకు భయపడకుండా ఉండాలని ధైర్యాన్ని కూడా నింపుతున్నారు. ఇప్పుడు మహేష్ కూడా తన వంతుగా కొన్ని సూచనలు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ”ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో.. సమాజానికి కాస్త దూరంగా ఉండటమే మంచిదని… సామాజిక జీవనాన్ని త్యాగం చేయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. మీ కుటుంబసభ్యులతో కలిసి ఎక్కువసమయం ఇంటిపట్టునే ఉండడం ద్వారా ఈ దశను అధిగమిద్దాం. ఇలా చేయడం ద్వారా వైరస్ మరింత వ్యాపించకుండా చేసి, మరిన్ని ప్రాణాలను కాపాడిన వాళ్లమవుతాం. పరిసరాలను శుభ్రంగా ఉంచండి, తరచుగా మీ చేతులను శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. వీలైనంతగా శానిటైజర్లను వినియోగించడం అలవర్చుకోండి. మీరు అస్వస్థతకు గురయ్యామని భావించినప్పుడే మాస్కు ధరించండి. ఇప్పుడు మనందరం కరోనాను తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిన స్థితిలో ఉన్నాం కాబట్టి అందరం కలసికట్టుగా పోరాడదాం… కరోనాను తరిమికొడదాం” అంటూ మహేశ్ బాబు పిలుపునిచ్చారు. అంతేకాదు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను కూడా పోస్ట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.