అప్పుడెప్పుడో ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ అప్పుడు చూశాం ఎన్టీఆర్, రామ్ చరణ్ ను ఒకేసారి. మళ్ళీ ఇప్పుడు ఇంతకాలం తర్వాత ఒకేసారి చూసే అవకాశం కలిగింది. కరోనా వైరస్ వీరిద్దరినీ ఒకేసారి చూసే అవకాశాన్ని కల్పించింది. కరోనా వల్ల ఇప్పటికే విదేశాల్లో షూటింగ్ లకు బ్రేక్ లు వేసాయి పలు సినిమాలు. అందులో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ చెప్పి రెస్ట్ తీసుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ నేపథ్యంలో ఏడాది తర్వాత చరణ్, ఎన్టీఆర్ కలసి మీడియా ముందుకు వచ్చారు. కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహనా పెంచేందుకు… కరోనా బారీన పడకుండా ఉండేందుకు ఈ వీడియో ద్వారా చరణ్, ఎన్టీఆర్ ప్రజలకు కొన్ని సూచనలు ఇచ్చారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనలు పాటిస్తే కోవిడ్ 19 వైరస్ బారీన పడకుండా ఉండొచ్చు అని తెలిపారు. చేతులు మోచేతివరకు సబ్బుతో కడగడం, కరోనా వైరస్ తగ్గేవరకు తెలిసిన వారిని కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలని.. చెప్పారు. అంతేకాదు వేడి సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని నమ్మొద్దని. తెలిపారు.
The world is going through one of its hardest times. The only way to get past #COVID19 is not panicking and spreading awareness.
Stay Hygienic. Stay Safe! pic.twitter.com/UMHnLmdkA8
— RRR Movie (@RRRMovie) March 16, 2020



కాగా బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.
ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























