నాగ‌శౌర్య‌తో నందినీరెడ్డి నెక్స్ట్ ప్రాజెక్ట్?

Oh Baby Director Nandini Reddy Join Hands With Naga Shourya For A New Movie

`అలా మొద‌లైంది`(2011)తో ద‌ర్శకురాలిగా తొలి అడుగేసింది నందినీ రెడ్డి. మొద‌టి సినిమాతోనే మంచి విజ‌యాన్ని అందుకున్న నందిని.. ఆపై `జ‌బ‌ర్ ద‌స్త్`, `క‌ళ్యాణ వైభోగ‌మే`, `ఓ బేబీ` చిత్రాల‌తో ప‌ల‌క‌రించింది. వీటిలో `జ‌బ‌ర్ ద‌స్త్` మిన‌హా మిగిలిన రెండు సినిమాలు కూడా విజ‌య‌తీరాల‌కు చేరుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా, `ఓ బేబీ` విడుద‌లై దాదాపు తొమ్మిది నెల‌ల‌వుతున్నా నందిని కొత్త చిత్రం ప‌ట్టాలెక్క‌లేదు. ఆ మ‌ధ్య యువ సామ్రాట్ నాగ‌చైత‌న్యతో నందినీ నెక్స్ట్ వెంచ‌ర్ ఉంటుంద‌ని క‌థ‌నాలు వ‌చ్చినా, కార్య‌రూపం దాల్చ‌లేదు. అయితే, తాజా స‌మాచారం ప్ర‌కారం… `క‌ళ్యాణ వైభోగ‌మే`, `ఓ బేబీ` చిత్రాల్లో క‌థానాయ‌కుడిగా న‌టించిన నాగ‌శౌర్య‌తోనే నందినీ రెడ్డి తదుప‌రి చిత్రం ఉంటుంద‌ని తెలిసింది. అంతేకాదు.. ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే శౌర్య‌, నందినీ రెడ్డి కాంబినేష‌న్ మూవీపై క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.