ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 158
టాలీవుడ్ లో రీమేక్ మూవీస్ హంగామా
నితిన్ బ్యానర్ లో అఖిల్ హీరోగా మూవీ ?
భయం.. నిర్లక్యం రెండూ వద్దు
పూజా హెగ్డే స్వీయ గృహ నిర్బంధం
బిజీ హీరోయిన్ నభా నటేష్
`యన్.బి.కె. 106` కోసం పాయల్ తో సంప్రదింపులు?
విశ్వక్ సేన్ కొత్త చిత్రం ప్రారంభం
రిపీట్ మోడ్ లో రవితేజ రొమాన్స్
ఫస్ట్ టైమ్ పోలీస్ రోల్ లో నేచురల్ స్టార్?
బాలయ్య, బి. గోపాల్ చిత్రానికి ముహూర్తం ఫిక్స్?

నిర్మాతగా మారనున్న కొరటాల..!
తండ్రి కథతో నరేష్ సినిమా..!
ప్రముఖ గాయని బయోపిక్ తో రానున్న సింగీతం..!
మరోసారి బాలయ్యతో..!

"నారప్ప" మూవీ షూటింగ్ కీలక షెడ్యూల్ పూర్తి
లేడీ ఓరియెంటెడ్ లో పూజా హెగ్డే..!
పూజా హెగ్డే కాదు కియారా అద్వానీ..!
డాక్టర్ అవతారమెత్తుతున్న సాయితేజ్?
`చిత్రలహరి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్, టాలెంటెడ్ బ్యూటీ నివేదా పెతురాజ్ కాంబినేషన్ లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. `ప్రస్థానం` ఫేమ్ దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీలో సీనియర్ యాక్ట్రస్ రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటించనుందని సమాచారం.
టాలీవుడ్ లో రీమేక్ మూవీస్ హంగామా
భారత చలన చిత్ర పరిశ్రమలో ఒక భాషలో హిట్ అయిన మూవీ ని మరో భాషలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు లో విజయం సాధించిన మూవీస్ ని హిందీ భాషలో రీమేక్ చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. సెన్సేషనల్ హిట్ మూవీ "అర్జునరెడ్డి "హిందీ లో "కబీర్ సింగ్ "గా రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు నాని హీరోగా నటించిన సూపర్ హిట్ "జెర్సీ "మూవీ హిందీ లో రీమేక్ జరుపుకోనుంది. టాలీవుడ్ మూవీస్, దర్శకుల పైన బాలీవుడ్ లో క్రేజ్ ఏర్పడింది.
అప్పుడు ఎన్టీఆర్ హీరోయిన్... ఇప్పుడు చరణ్ హీరోయిన్
టైటిల్ చూసి అప్పుడు ఎన్టీఆర్ హీరోయిన్ ఏంటీ... ఇప్పుడు చరణ్ హీరోయిన్ ఏంటి అన్న డౌట్ వచ్చింది కదా... అసలు సంగతేంటంటే...ఆర్ఆర్ఆర్.. ప్రతిఒక్క సినీ ప్రేక్షకుడు ఎంతగానే ఎదురుచూస్తున్న సినిమా. ఇక సినిమాలో ఎన్టీఆర్, చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 70శాతం షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. సెప్టెంబర్ కల్లా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే గత కొద్దికాలంగా జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుండగా...కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ చెప్పారు.
నితిన్ బ్యానర్ లో అఖిల్ హీరోగా మూవీ ?
హీరో నితిన్ స్వంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పై అఖిల్ అక్కినేని హీరోగా VV వినాయక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో "అఖిల్ "మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఈ మూవీ తో అఖిల్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "అఖిల్ "మూవీ దారుణంగా పరాజయం పొందింది. అఖిల్ హీరోగా మరో మూవీ ని నితిన్ నిర్మించనున్నారని సమాచారం.
భయం.. నిర్లక్యం రెండూ వద్దు
కరోనా వరుస భయం యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే విదేశాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండగా...మనదేశంలో నివారణ చర్యలు ముమ్మరం చేశారు. దీనిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దీనిలో భాగంగానే పలువురు సెలబ్రిటీలు తమ వంతుగా ఈ వైరస్ అంటకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పలు వీడియోల ద్వారా చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా వీడియో ద్వారా ప్రజలకు ధైర్యాన్ని.. సలహాలను పంచుకున్నారు.
పూజా హెగ్డే స్వీయ గృహ నిర్బంధం
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజా హెగ్డే పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే ప్రస్తుతం "#Prabhas 20", అఖిల్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ లో పూజ నటించిన "హౌస్ ఫుల్ 4" మూవీ ఘనవిజయం సాధించటం తో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందే "కభీ ఈద్ కభీ దివాలీ " మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
బిజీ హీరోయిన్ నభా నటేష్
సక్సెస్ ఫుల్ "నన్ను దోచుకుందువటే" మూవీ తో కన్నడ బ్యూటీ నభా నటేష్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్" మూవీ లో తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నభా నటేష్ పలు మూవీ ఆఫర్స్ అందుకున్నారు.తన గ్లామరస్ ఫోటో షూట్స్ తో క్రేజ్ పెంపొందించుకొన్న నభా నటేష్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది.
`యన్.బి.కె. 106` కోసం పాయల్ తో సంప్రదింపులు?
`ఆర్ ఎక్స్ 100`తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. అయితే, ఆ తరువాత మాత్రం ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. కాకపోతే, సీనియర్ స్టార్ వెంకటేష్ తో కలసి నటించిన `వెంకిమామ` కాస్త ఊరటనిచ్చింది. కాగా, మరో సీనియర్ హీరోతో పాయల్ నటించే అవకాశముందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ తో కథనాలు వినిపిస్తున్నాయి.
విశ్వక్ సేన్ కొత్త చిత్రం ప్రారంభం
సక్సెస్ ఫుల్ మూవీ "ఫలక్ నుమా దాస్" మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న విశ్వక్ సేన్ నటించిన "HIT" మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో ఇన్ స్పెక్టర్ విక్రమ్ రుద్రరాజు క్యారెక్టర్ లో విశ్వక్ సేన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఈ రోజు విశ్వక్ సేన్ హీరోగా #VS5 మూవీ పూజా కార్యక్రమం జరుపుకుంది.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మహేష్, పరశురామ్ చిత్రం?
సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు జి. మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్, కొరటాల శివ హోమ్ ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా మే లేదా జూన్ లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశముందని ప్రచారం సాగుతోంది.
రిపీట్ మోడ్ లో రవితేజ రొమాన్స్
గత చిత్రం `డిస్కో రాజా`లో ముచ్చటగా ముగ్గురు కథానాయికలతో సందడి చేశాడు మాస్ మహారాజా రవితేజ. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హోప్.. ఇలా ఇదివరకు తను జోడీకట్టని భామలతోనే ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశాడాయన. కట్ చేస్తే.. రాబోయే చిత్రాల్లో మాత్రం అందుకు భిన్నంగా ఆల్రెడీ తను జట్టుకట్టిన నాయికలతోనే `రిపీట్` రొమాన్స్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు రవితేజ.
ఫస్ట్ టైమ్ పోలీస్ రోల్ లో నేచురల్ స్టార్?
నేచురల్ స్టార్ నాని.. ఇప్పటివరకు పోలీస్ పాత్రలో కనిపించిన సందర్భం లేదు. త్వరలోనే ఆ ముచ్చట తీరనుందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. `నిన్ను కోరి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత నాని, దర్శకుడు శివ నిర్వాణ మరోసారి జట్టుకట్టిన సంగతి తెలిసిందే. `టక్ జగదీష్` పేరుతో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కోసమే నాని ఖాకీ ధరించనున్నాడట. జగపతిబాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో నానికి జోడీగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ సందడి చేయనున్నారు. థమన్ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలైలో విడుదల కానుందని సమాచారం.
బాలయ్య, బి. గోపాల్ చిత్రానికి ముహూర్తం ఫిక్స్?
నటసింహ నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్టోరియల్ తో బిజీగా ఉన్నారు. నటుడిగా ఆయనకది 106వ సినిమా. కాగా, తన 107వ చిత్రాన్ని తన లక్కీ డైరెక్టర్స్ లో ఒకరైన బి. గోపాల్ కాంబినేషన్ లో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాని జూన్ 10న బాలయ్య పుట్టినరోజుని పురస్కరించుకుని ప్రారంభించనున్నట్లు తెలిసింది. త్వరలోనే బాలయ్య, బి. గోపాల్ కాంబినేషన్ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

నిర్మాతగా మారనున్న కొరటాల..!
ఒకప్పుడు సినీపరిశ్రమలో నిర్మాత పని నిర్మాత చేసేవాడు. డైరెక్టర్ అంటే సినిమా మాత్రమే డైరెక్ట్ చేసేవాడు. హీరో పని హీరో చేసేవాడు. అయితే ఇప్పుడు మొత్తం మారిపోయింది. డైరెక్టర్ లు కూడా నిర్మాతలుగా మారుతున్నారు. ఇక హీరోలైతే సొంత ప్రొడక్షన్స్ పెట్టేసుకొని వాళ్ళ సినిమాలు వాళ్ళే తీసుకుంటున్నారు. ఇటీవలే పూరీ జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాను తన ప్రొడక్షన్ లో తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఇక సుకుమార్ అయితే ఒక పక్క స్టార్ హీరోలతో సినిమాలు తెస్తూనే మరోపక్క చిన్న హీరోలతో నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో డైరెక్టర్ కూడా నిర్మాతగా మారాలనుకుంటున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. వరుస హిట్లతో…
తండ్రి కథతో నరేష్ సినిమా..!
ఈవీవీ కథను అల్లరి నరేష్ చేయడం ఏంటబ్బా అని అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. ఈవీవీ ఉన్న టైంలో అల్లరి నరేష్ తో సినిమా చేయనుకున్నాడట. అందుకుగానూ ఒక స్క్రిప్ట్ ను కూడా రెడీ చేశారట. ఆ తర్వాత ఈవీవీ కలగమనం చెందటం.. అల్లరి నరేష్ కూడా వేరే సినిమాలతో బిజీ అవ్వడంతో ఈ స్క్రిప్ట్ పక్కన పడిపోయింది. ఇప్పుడు అదే కథను సినిమాగా తీయబోతున్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్ ఎన్నో గొప్ప గొప్ప సినిమాలను తీసిన ఈవీవీ సినిమా పతాకంపైనే ఈ సినిమాను నరేష్ తెరకెక్కించనున్నాడట. నరేష్‌కీ అత్యంత సన్నిహితంగా ఉన్న ఓ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తాడని సమాచారం. అంతేకాదు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఇది ఈవీవీ గత హిట్…
ప్రముఖ గాయని బయోపిక్ తో రానున్న సింగీతం..!
సింగీతం శ్రీనివాసరావు అంటే మనకి వెంటనే గుర్తొచ్చే సినిమా పేరు పుష్ఫకవిమానం. ఆయన సినీ కెరీర్ లో పుష్ఫకవిమానం, ఆదిత్య 369, విచిత్ర సోదరులు లాంటి ఎన్నో గొప్ప సినిమాలను అందించారు. ఆయన చివరిగా వెల్ కమ్ ఒబామా అనే సినిమా తీసారు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు డైరెక్షన్ చేయడానికి ముందుకొస్తున్నారు. కొత్త కొత్త కథలతో.. కొత్త కొత్త దర్శకులు.. ఎంతో మంది సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఈ వయసులో.. ఇన్నేళ్ల తర్వాత మరోసారి దర్శకత్వం చేయడానికి రెడీ అయ్యారు.
మరోసారి బాలయ్యతో..!
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ 'సింహా', 'లెజెండ్' తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా..సెకండ్ షెడ్యూల్ ను ఏప్రిల్ నుండి మొదలుపెట్టనున్నారు. కరోనా కారణంగా కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చారు. ఏప్రిల్ నుండి మరో షెడ్యూల్ ను ప్రారంభించనున్నారు.

"నారప్ప" మూవీ షూటింగ్ కీలక షెడ్యూల్ పూర్తి
సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా యాక్షన్ డ్రామా "నారప్ప" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "అసురన్" తమిళ మూవీ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న "నారప్ప" మూవీ లో ప్రియమణి కథానాయిక కాగా ప్రకాష్ రాజ్, మురళీశర్మ, సంపత్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.మణిశర్మ సంగీతం అందించారు.
లేడీ ఓరియెంటెడ్ లో పూజా హెగ్డే..!
మొదట ఐరెన్ లెగ్ అనే ముద్ర వేసుకుంది.. కానీ ఇప్పుడు ఆమె కాళ్ల మీదే పాట రాసే స్థాయికి ఎదిగింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఐడియా వచ్చే ఉంటది. ఆ బుట్టబొమ్మ ఎవరో కాదు పూజా హెగ్డే. ముకుంద సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే కి మొదట అన్నీ ఫ్లాప్సే పలకరించాయి. ఆ ఆతర్వాత దువ్వాడ జగన్నాథం సినిమాతో కాస్త ఫామ్ లోకి వచ్చి.. ఇటీవల వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఏ సినిమాలో అయినా ఫస్ట్ ఛాయస్ గా పూజా హెగ్డే పేరునే సెలెక్ట్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.
పూజా హెగ్డే కాదు కియారా అద్వానీ..!
కొరటాల దర్శకత్వంలో చిరు హీరో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే కరోనా వల్ల కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణే ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చరణ్ పక్కన నటించేందుకు పూజా హెగ్డే ను అప్రోచ్ అయ్యారట. అయితే చరణ్ మాత్రం తనకు ఫ్రెండ్ అయిన కియారా ను అడిగినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఎవరిని ఎంపిక చేస్తారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.