ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. గత కొద్దికాలంగా జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుండగా…కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ చెప్పారు. ఇదిలా ఉండగా ఇప్పటికే 70శాతం షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. సెప్టెంబర్ కల్లా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇక ఇప్పటివరకూ ఎన్టీఆర్, చరణ్ కు సంబంధించినంత వరకూ షూటింగ్ ను జరుపుకోగా…. అలియా మే నుండి షూటింగ్ ను లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ఇంకా మిగిలిన పాత్రలకు సంబంధించి పోర్షన్ ను కూడా తొందరలో కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. 2021 జనవరి 8వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























