నిర్మాతగా మారనున్న కొరటాల..!

Star Director Koratala Siva Turns Film Producer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Koratala Siva,Koratala Siva Latest News,Director Koratala Siva New Movie News,Koratala Siva Upcoming Film Updates,Koratala Siva Next Project News,Koratala Siva Latest Movie Details

ఒకప్పుడు సినీపరిశ్రమలో నిర్మాత పని నిర్మాత చేసేవాడు. డైరెక్టర్ అంటే సినిమా మాత్రమే డైరెక్ట్ చేసేవాడు. హీరో పని హీరో చేసేవాడు. అయితే ఇప్పుడు మొత్తం మారిపోయింది. డైరెక్టర్ లు కూడా నిర్మాతలుగా మారుతున్నారు. ఇక హీరోలైతే సొంత ప్రొడక్షన్స్ పెట్టేసుకొని వాళ్ళ సినిమాలు వాళ్ళే తీసుకుంటున్నారు. ఇటీవలే పూరీ జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను తన ప్రొడక్షన్ లో తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఇక సుకుమార్ అయితే ఒక పక్క స్టార్ హీరోలతో సినిమాలు తెస్తూనే మరోపక్క చిన్న హీరోలతో నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో డైరెక్టర్ కూడా నిర్మాతగా మారాలనుకుంటున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. వరుస హిట్లతో తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన కొరటాలశివ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొరటాల శివ కూడా సొంత ప్రొడక్షన్ స్టార్ చేసి నిర్మతగా సినిమాలు తీయాలనుకుంటున్నాడట. అంతే ఇప్పటికే ఒక స్టార్ హీరోతో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తుంది. ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ తో కలిపి పెద్ద సినిమాలు తీయాలన్న ప్లాన్ లో వున్నాడట. మరి గతంలోనే తన ఫ్రెండ్ తో కలిసి ఒక సినిమాను నిర్మించాలనుకున్నాడు… కానీ అది అప్పుడు వర్కౌట్ కాలేదు.. ఇప్పుడైనా కొరటాల ప్లాన్ వర్కౌట్ అవుతుందేమో చూద్దాం..

కాగా ప్రస్తుతం కొరటాల చిరుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.