టాలీవుడ్ లో రీమేక్ మూవీస్ హంగామా

Tollywood Becomes Biggest Hub For Remake Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Tollywood,Latest Telugu Movies,New Telugu Movies,Tollywood Movie Latest News,Tollywood Film News

భారత చలన చిత్ర పరిశ్రమలో ఒక భాషలో హిట్ అయిన మూవీ ని మరో భాషలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు లో విజయం సాధించిన మూవీస్ ని హిందీ భాషలో రీమేక్ చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. సెన్సేషనల్ హిట్ మూవీ “అర్జునరెడ్డి “హిందీ లో “కబీర్ సింగ్ “గా రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు నాని హీరోగా నటించిన సూపర్ హిట్ “జెర్సీ “మూవీ హిందీ లో రీమేక్ జరుపుకోనుంది. టాలీవుడ్ మూవీస్, దర్శకుల పైన బాలీవుడ్ లో క్రేజ్ ఏర్పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం టాలీవుడ్ లో తమిళ మూవీస్ తెలుగు రీమేక్ హవా నడుస్తుంది. రీసెంట్ గా తమిళ మూవీస్ రీమేక్స్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ “రాక్షసుడు”, వరుణ్ తేజ్ “గద్దలకొండ గణేష్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రామ్ పోతినేని “RED”, విక్టరీ వెంకటేష్ “నారప్ప” , రవితేజ “క్రాక్ ” మూవీస్ తమిళ రీమేక్ లే. ఇక హిందీ మూవీస్ కూడా రీమేక్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ “వకీల్ సాబ్” హిందీ హిట్ మూవీ “పింక్”రీమేక్ గా రూపొందుతుంది. బ్లాక్ బస్టర్ “అంధా ధున్ ” హిందీ మూవీ తెలుగు లో నితిన్ హీరోగా రూపొందనుంది. ఇలా పలు ఇతర భాషా చిత్రాలు తెలుగు లో రీమేక్ అవుతున్నాయి

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 2 =