భయం.. నిర్లక్యం రెండూ వద్దు

Megastar Chiranjeevi Appeal On Coronavirus Scare,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Megastar Chiranjeevi,Coronavirus Outbreak,Coronavirus,Coronavirus Scare,Megastar Chiranjeevi About Coronavirus,Chiranjeevi Safety Measures On Coronavirus,Coronavirus Disease

కరోనా వరుస భయం యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే విదేశాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండగా…మనదేశంలో నివారణ చర్యలు ముమ్మరం చేశారు. దీనిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దీనిలో భాగంగానే పలువురు సెలబ్రిటీలు తమ వంతుగా ఈ వైరస్ అంటకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పలు వీడియోల ద్వారా చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా వీడియో ద్వారా ప్రజలకు ధైర్యాన్ని.. సలహాలను పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

” అందరికి నమస్కారం.. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకి గురి చేస్తున్న సమస్య కరోనా.. అయితే మనకి ఎదో అయిపోతుందన్న భయం కానీ, మనం ఏమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండు పనికిరావు. జగ్రత్తగా ఉండి, దైర్యంగా ఎదురుకోవాల్సిన సమయం ఇది.. జనసముహానికి వీలైనంత వరకూ దూరంగా ఉండండి. ఈ ఉద్రుత్తం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవ్వడం ఉత్తమం.

వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..మోచేతి వరకు చేతులను సబ్బుతో శుభ్రంగా సుమారు 22 సెకెండ్ల పాటుగా కడుక్కోండి! తుమ్మున, దగ్గిన కర్చీప్ లాంటివి అడ్డం పెట్టుకోవడం లేదా టిష్యు పేపర్ లను అడ్డు పెట్టుకోవడం తప్పనిసరి.. ఆ వాడిన టిష్యు పేపర్ కూడా చేత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి,కంటికి మొఖానికి,తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం,జలుబు,దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి! ఈ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా ప్రమాది కారి కాకపోయినప్పటికీ, నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అవకాశం ఉంది. అలా కాకుండా చూసుకునే భాద్యత మన పైన ఉంది. ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయ ప్రకారం నమస్కారం చేద్దాం.. అదే ఉత్తమం ” అని చిరంజీవి పేర్కొన్నారు.

మరి ఎవరో ఒకరు చెప్పారు అని కాకుండా.. ఎవరికి వారు స్వయంగా పూనుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనల్ని మనం రక్షించుకోవడం తో పాటు ఇతరుల్ని కూడా రక్షించిన వాళ్ళం అవుతాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =