ఫ‌స్ట్ టైమ్ పోలీస్ రోల్ లో నేచుర‌ల్ స్టార్?

Natural Star Nani Plays Cop For The First Time

నేచుర‌ల్ స్టార్ నాని.. ఇప్ప‌టివ‌ర‌కు పోలీస్ పాత్ర‌లో క‌నిపించిన సంద‌ర్భం లేదు. త్వ‌ర‌లోనే ఆ ముచ్చ‌ట తీర‌నుంద‌ని స‌మాచారం. ఆ వివ‌రాల్లోకి వెళితే.. `నిన్ను కోరి` వంటి విజ‌యవంత‌మైన చిత్రం త‌రువాత నాని, ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ మ‌రోసారి జ‌ట్టుక‌ట్టిన సంగ‌తి తెలిసిందే. `ట‌క్ జ‌గ‌దీష్` పేరుతో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ కోస‌మే నాని ఖాకీ ధ‌రించ‌నున్నాడ‌ట‌. జ‌గ‌ప‌తిబాబు ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న ఈ సినిమాలో నానికి జోడీగా రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ సంద‌డి చేయ‌నున్నారు. థ‌మ‌న్ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలైలో విడుద‌ల కానుంద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యమేమిటంటే… విడుద‌ల‌కు సిద్ధ‌మైన `వి`లో కాప్ (సుధీర్ బాబు)తో మైండ్ గేమ్ ఆడే ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్న నాని.. ఆ వెంట‌నే `ట‌క్ జ‌గ‌దీష్`లో పోలీస్ పాత్ర‌లో న‌టిస్తుండ‌డం. మ‌రి.. ఈ రెండు సంద‌ర్భాల్లోనూ నాని విజ‌య‌కేత‌నం ఎగుర‌వేస్తాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.