సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా యాక్షన్ డ్రామా “నారప్ప” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “అసురన్” తమిళ మూవీ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న “నారప్ప” మూవీ లో ప్రియమణి కథానాయిక కాగా ప్రకాష్ రాజ్, మురళీశర్మ, సంపత్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.మణిశర్మ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“నారప్ప” మూవీ షూటింగ్ కీలక షెడ్యూల్ ను నిర్మాతలు తమిళనాడు లో ప్లాన్ చేశారు. కరోనా వైరస్ కారణంగా టాలీవుడ్ మూవీ షూటింగ్స్ రద్దయిన విషయం తెలిసిందే. 2రోజులు అధికంగా షూటింగ్ లో పాల్గొని వెంకటేష్ ఆ షెడ్యూల్ కంప్లీట్ చేశారు .హీరో వెంకటేష్, మూవీ టీమ్ ఈ రోజు హైదరాబాద్ చేరుకున్నారు. కరోనా వైరస్ అదుపులోకి వచ్చిన తరువాత “నారప్ప” మూవీ షూటింగ్ ఆఖరి షెడ్యూల్ జరుగనుంది. “నారప్ప” మూవీ మే 8వ తేదీ రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఒక వారం రోజులలో పరిస్థితులు చక్కబడకపోతే రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: