నటసింహ నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్టోరియల్ తో బిజీగా ఉన్నారు. నటుడిగా ఆయనకది 106వ సినిమా. కాగా, తన 107వ చిత్రాన్ని తన లక్కీ డైరెక్టర్స్ లో ఒకరైన బి. గోపాల్ కాంబినేషన్ లో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాని జూన్ 10న బాలయ్య పుట్టినరోజుని పురస్కరించుకుని ప్రారంభించనున్నట్లు తెలిసింది. త్వరలోనే బాలయ్య, బి. గోపాల్ కాంబినేషన్ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గతంలో బాలకృష్ణ, బి. గోపాల్ కాంబినేషన్ లో `లారీ డ్రైవర్`, రౌడీ ఇన్స్ పెక్టర్`, `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు` వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. అయితే, ఐదో సినిమాగా వచ్చిన `పలనాటి బ్రహ్మనాయుడు` మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. మరి.. సుదీర్ఘ విరామం అనంతరం వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తోనైనా ఈ కాంబో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































