సూపర్ హిట్ మూవీ “పటాస్” తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన అనిల్ రావిపూడి “సుప్రీమ్ “, “రాజా ది గ్రేట్” , “F 2”, “సరిలేరు నీకెవ్వరు ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం అనిల్ బ్లాక్ బస్టర్ “F 2” మూవీ సీక్వెల్ “F 3 ” మూవీ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటుడు,దర్శకుడు తరుణ్ భాస్కర్ హోస్ట్ గా ఉన్న “మీకు మాత్రమే చెప్తా “టీవీ ప్రోగ్రామ్ లో అనిల్ పాల్గొని తాను చేసే సినిమాలు, చెయ్యాలనుకునే సినిమాల గురించి తెలిపారు. తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు బాలకృష్ణ, మోక్షజ్ఞ ఫోటో తన రూమ్ లో ఉండేదని , మోక్షజ్ఞ తో ఎప్పటికైనా ఒక మూవీ చేస్తానని తన స్నేహితులతో చెప్పేవాడినని, బాలకృష్ణ, మోక్షజ్ఞ లతో మల్టీ స్టారర్ మూవీ రూపొందించాలనేది తన కల అని, “F 3 ” మూవీ తెరకెక్కించనున్నానని, సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చేయనున్నామని, ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ స్క్రిప్ట్ కూడా రెడీ గా ఉందని అనిల్ తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: