నాగ‌చైత‌న్య‌తో `మనం` ద‌ర్శ‌కుడి ప్రేమ‌క‌థా చిత్రం?

Naga Chaitanya Join Hands With Vikram Kumar After Manam

`మ‌నం`(2014)… యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య కెరీర్ లో మెమ‌ర‌బుల్ ఫిల్మ్. త‌న తాత‌య్య అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, తండ్రి నాగార్జున‌, శ్రీ‌మ‌తి స‌మంత‌తో చైతూ స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్ర‌మ‌ది. అలాంటి `మ‌నం`ని రూపొందించిన ఘ‌న‌త ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె. కుమార్ ది. కాగా, త‌న‌కి `మ‌నం` రూపంలో మెమ‌ర‌బుల్ ఫిల్మ్ ని అందించిన విక్ర‌మ్ తో మ‌రోసారి జ‌ట్టుక‌ట్ట‌బోతున్నాడ‌ట చైతూ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు.. `నా ఆటోగ్రాఫ్`, `ప్రేమ‌మ్` త‌ర‌హాలో మూడు వేర్వేరు ద‌శ‌ల్లో సాగే ఓ యువ‌కుడి ప్రేమ‌క‌థ‌ల స‌మ్మేళ‌నంగా ఈ సినిమా ఉంటుంద‌ట‌. అలాగే అనుభూతుల మ‌యంగా సాగే ఈ చిత్రంలో చైతూ పాత్రని చ‌క్క‌గా డిజైన్ చేశాడ‌ట విక్ర‌మ్ కె. కుమార్. మ‌రి.. `మ‌నం` వంటి క్లాసిక్ త‌రువాత చైతూ, విక్ర‌మ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా కూడా అదే తీరున మురిపిస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + ten =