నంద‌మూరి బాబాయ్ – అబ్బాయ్ ల చిత్రాల్లో శ్రియ‌?

Actress Shriya Saran Once Again To Pair Up With Balakrishna and Jr NTR

నంద‌మూరి బాబాయ్ న‌ట‌సింహ బాల‌కృష్ణ‌తోనూ, అబ్బాయ్ యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్ తోనూ ఆడిపాడిన క‌థానాయిక‌ల్లో శ్రియ ఒక‌రు. బాల‌య్యతో `చెన్న‌కేశ‌వ‌రెడ్డి`(2002), `గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి`, `పైసా వ‌సూల్`(2017) చిత్రాల్లో రొమాన్స్ చేసిన శ్రియ‌.. తార‌క్ తో `నా అల్లుడు`(2005)లో జోడీ కట్టింది. అయితే, ఒకే స‌మ‌యంలో వీరిద్ద‌రి చిత్రాల్లో శ్రియ న‌టించిన సంద‌ర్భాలు మాత్రం లేవు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే, ప్ర‌స్తుతం శ్రియ చేతిలో ఉన్న రెండు తెలుగు సినిమాలు కూడా నంద‌మూరి బాబాయ్ – అబ్బాయ్ ల‌వే కావ‌డం విశేషం. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న పేరు నిర్ణ‌యించని చిత్రంలో బాల‌య్య‌కి జంట‌గా న‌టించ‌నున్న శ్రియ‌.. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `ఆర్ ఆర్ ఆర్`లోనూ సంద‌డి చేయ‌నుంది. కాక‌పోతే, `ఆర్ ఆర్ ఆర్`లో తార‌క్ జంట‌గా కాకుండా అత‌ని గురువు పాత్ర‌ధారి అయిన అజ‌య్ దేవ‌గ‌ణ్ కి పెయిర్ గా క‌నిపించ‌నుండ‌డం విశేషం. ఎటొచ్చి, ఈ రెండు సినిమాల్లో శ్రియ ఎంట్రీపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =