మన తెలుగు సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అక్కడి నిర్మాతలు. ఇప్పటికే పలు సినిమాలు హిందీలో రీమేక్ చేసుకున్నాయి. ప్రస్తుతం కొన్ని సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ హిందీలో భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించాయి. ఇక నాని జెర్సీ సినిమాలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. ఆర్ఎక్స్100′, ఓ బేబీ’ చిత్రాల రైట్స్ ను సైతం కొనేశారు. అలాగే ‘డియర్ కామ్రేడ్’ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ను నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరొక తెలుగు చిత్రాన్ని కూడా హిందీలోకి రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా ఏదో కాదు ఇటీవలే వచ్చిన నితిన్ హిట్ సినిమా బీష్మ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ – రష్మిక కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా భీష్మ. ఈ సినిమా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 21న విడుదల అయ్యింది. విడుదలైన మొదటి ఆట నుండే హిట్ టాక్ ను సొంతం చేసుకొని ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారట. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)