పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో ఓ పిరియాడిక్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ఎం.ఎం. కీరవాణి బాణీలు అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే… మొఘలాయిల కాలం నాటి వాతావరణంతో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడట. అందులో ఒకటి రాబిన్ హుడ్ తరహా పాత్ర కాగా.. మరొకటి మాత్రం చాలా సర్ ప్రైజింగ్ గా ఉంటుందట. త్వరలోనే పవన్ డ్యూయెల్ రోల్ పై క్లారిటీ వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవన్ తన కెరీర్ లో ఇప్పటివరకు `తీన్ మార్` చిత్రంలో మాత్రమే ద్విపాత్రాభినయం చేశాడు. అయితే, అందులో పవన్ పోషించిన అర్జున్ పాల్వాయ్, మైఖేల్ వేలాయుధం పాత్రలు వేర్వేరు కాలాలకి చెందినవి. అందుకే కాంబినేషన్ సీన్స్ ఉండవు. మరి.. క్రిష్ చిత్రంలో అయినా ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు పవన్ లు కనిపిస్తారేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: