కరోనా కోసం తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం

Actor Nithiin Donates Money To CM Relief Fund For Coronavirus Prevention

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటికే పలు పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. అనుమానిత కేసులు మాత్రం చాలానే నమోదయ్యాయి. ముఖ్యంగా తెలంగాణాలో 30కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందుకే ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మార్చి 31వ వ‌ర‌కు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. అత్యవసరం అయితే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి ప్రభుత్వాలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే, కరోనా వైరస్‌పై పోరాటం చేయడంలో తన వంతు బాధ్యతగా యంగ్ హీరో నితిన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రూ.10 లక్షల చొప్పున విరాళం ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంక్షేమ నిధులకు ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి 10 లక్షలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి రూ. 10 ల‌క్ష‌ల చొప్పున విరాళాన్ని అందచేశాడు. క‌రోనా క‌ట్ట‌డికి రెండు తెలుగు రాష్ట్రాలు చిత్త‌శుద్ధితో కృషి చేస్తున్నాయ‌ని.. ప్ర‌జ‌లంద‌రూ రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

కాగా ఇటీవలే నితిన్ నటించిన భీష్మ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే త్వరలో నితిన్ వివాహం కూడా జరగనుంది. నిజానికి ఏప్రిల్ 16న నితిన్ వివాహం జరగాల్సి ఉంది… కానీ కరోనా వల్ల వాయిదా పడింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.