పవన్ క్రేజ్.. ఎన్టీఆర్ నటన ఎవరికీ సాధ్యం కాదు..!

Pawan Style And Jr NTR Action Is Unimitable Says KGF Director Prashanth Neel,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Pawan Kalyan Style,Jr NTR Action,KGF Director,Prashanth Neel,Director Prashanth Neel Latest News,Prashanth Neel About Jr NTR,Prashanth Neel Comments On Pawan KalyanJr NTR,Pawan Kalyan,Prashanth Neel,KGF

టాలీవుడ్ హీరోల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఎంతమంది హీరోలు ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ మాత్రం సెపరేట్. అలాగే ఎన్టీఆర్ నటన కూడా డిఫరెంట్. ఇక ఈ విషయాన్నే చెబుతూ.. వీరిద్దరిపై ప్రశంసలు కురిపించారు కె.జి.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ మరొకరికి సాధ్యం కాదని .. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన మరొకరు భర్తీ చేయలేనిది అని ప్రశంశించారు. రాజమౌళి మిగిలినవారందరికి సరికొత్త దారి చూపించే దర్శకుడు అని.. తాను ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఎంతో ఆసక్తి… ఎదురుచూస్తున్నట్లు ప్రశాంత్ నీల్ తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా కె.జి.ఎఫ్ చాప్టర్ 1 సీక్వెల్ కె.జి.ఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. సంజయ్ దత్, రవీనా టాండన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు.. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 250 కోట్లు వ‌సూలు చేసి రికార్డులు సృష్టించింది. మరి ఈ సీక్వెల్ ఎంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.