బ్లాక్ బస్టర్ “ఛలో” మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన కన్నడ బ్యూటీ రష్మిక “గీత గోవిందం”, “సరిలేరు నీకెవ్వరు” , “భీష్మ” వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో అగ్ర తారగా దూసుకుపోతున్నారు. రష్మిక ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి కొత్త దర్శకులకు అవకాశం కల్పించాలని ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మంచి స్క్రిప్ట్స్ ఉంటే తనను సంప్రదించాలనే రష్మిక ప్రకటనకు అనూహ్య స్పందన లభించింది. పలువురు యువ దర్శకులు తమ స్క్రిప్ట్స్ ను రష్మిక కు అందజేశారు. ప్రస్తుతం రష్మిక, ఆమె టీమ్ స్క్రిప్ట్స్ పరిశీలనలో బిజీగా ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్ కు తాత్కాలికంగా బ్రేక్ పడటంతో ఆ టైమ్ ను రష్మిక స్క్రిప్ట్స్ పరిశీలనలో సద్వినియోగం చేసుకుంటున్నారు. హీరోయిన్ రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న AA 20 మూవీలో నటిస్తున్నారు. హీరోయిన్ గా సక్సెస్ అయిన రష్మిక ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ కావాలని కోరుకుందాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: