‘ఉప్పెన’ లా దూసుకువస్తున్న కృతి శెట్టి..!

Actress Krithi Shetty Gets Busy In Tollywood With Handfull Of New Movie Offers

టాలీవుడ్ కి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ కొంతమంది మాత్రమే నోటెడ్ అవుతారు. కొంతమందికి మాత్రమే లక్ కలిసొస్తుంది. ఇక ఇక్కడ ఒక అప్ కమింగ్ హీరోయిన్ తన క్యూట్ లుక్స్, నవ్వుతో అందరినీ కట్టిపడేసింది. అందుకే ఇంకా తన మొదటి సినిమా కూడా విడుదల కాకముందే ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి. ఉప్పెనలా దూసుకువస్తుంది ఈ భామ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. నిజానికి ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి ఒక రకంగా కృతి శెట్టినే కారణమని చెప్పొచ్చు. ధక్ ధక్ ధక్ అనే పాట విడుదల అయినప్పటి నుండి ఈ సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. ఈ పాటలో కృతి శెట్టి అందానికి.. అభినయానికి ఫిదా అయ్యారు అందరు. ఉప్పెన సినిమాలో తన క్యూట్ పెర్ఫార్మన్స్ చూసిన సుకుమార్ వెంటనే మరో సినిమాలో సినిమాలో సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు.

కుమారి 21 ఎఫ్‍ ఫేమ్‍ పల్నాటి సూర్య ప్రతాప్‍ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ’18 పేజీస్’ సినిమా తెరకెక్కబోతుంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన కృతి శెట్టి ని సెలెక్ట్ చేశాడు సుకుమార్. ఈ చిత్రానికి సుకుమార్ కథ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇది కాకుండా ఇప్పుడు కృతి శెట్టికి మరో సినిమా ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్ హీరోగా ఇటీవలే పాగల్ అనే సినిమా లాంచ్ అయిన విషయం తెల్సిందే. నూతన దర్శకుడు నరేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ సినిమాకు హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకోనున్నట్లు సమాచారం.

మరి మొదటి సినిమా విడుదల కాకముందే ఈ యంగ్ హీరోయిన్ కు ఇన్ని ఆఫర్స్ వస్తే.. ఇక ఒక్కసారి సినిమా హిట్ అయితే కనుక…ఈ భామను పట్టుకోవడం కష్టమే.. చూద్దాం మరి ఏం జరుగుతుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 2 =