‘గబ్బర్ సింగ్’ (2012) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ మరోసారి జట్టుకట్టనున్న సంగతి తెలిసిందే. దాదాపు ఎనిమిదేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం పవన్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రం కోసం మరోసారి ఫక్తు మాస్ ఎంటర్‌టైనర్ ని సిధ్ధం చేస్తున్నాడు హరీష్. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం చివరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ఇదిలా ఉంటే… ఈ చిత్రంలో కథానాయికగా నటించే అవకాశం స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డేని వరించిందని వార్తలు వినిపిస్తున్నాయి. అదే గనక నిజమైతే… పవన్ కాంబినేషన్‌లో పూజకి ఇదే తొలి చిత్రమవుతుంది. ఇక `డీజే`, `గద్దలకొండ గణేష్` తరువాత హరీష్‌తో థర్డ్ జాయింట్ వెంచర్ అవుతుంది. త్వరలోనే పూజ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























