యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు అచ్చొచ్చిన కథానాయికల్లో అనుష్క ఒకరు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాలన్నీ విజయపథంలో పయనించాయి. అలాంటి ఈ ఇద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘బిల్లా’. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్టైలిష్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ను ప్రభాస్ హోమ్ బ్యానర్ గోపీకృష్ణ మూవీస్ సంస్థ నిర్మించింది. ఇందులో బిల్లా, రంగా అనే రెండు విభిన్న పాత్రల్లో సందడి చేశాడు డార్లింగ్. ప్రభాస్ కెరీర్ లో ఇదే తొలి ద్విపాత్రాభినయ చిత్రం కావడం విశేషం. అలాగే తన పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజుతోనూ మొదటిసారి కలసి నటించిన సినిమా కూడా `బిల్లా`నే కావడం మరో విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో నమిత, రెహమాన్, ఆదిత్య, సుప్రీత్, అలీ, కెల్లీ దోర్జీ ముఖ్య భూమికలు పోషించగా… జయసుధ, హన్సిక మోత్వాని, సుబ్బరాజు అతిథి పాత్రల్లో దర్శనమిచ్చారు. రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, మెహర్ రమేష్ గీత రచనకు… “మెలోడి బ్రహ్మ” మణిశర్మ అలరించే బాణీలు సమకూర్చారు. ముఖ్యంగా “బొమ్మాళి” పాట సంచలనం సృష్టించగా “మై నేమ్ ఈజ్ బిల్లా”, “ఎల్లోరా శిల్పాన్ని”, “నీ పటాసు”, “హరిలో రంగ హరి” వంటి గీతాలు కూడా శ్రోతలను ఆకట్టుకున్నాయి. 2009 ఏప్రిల్ 3న విడుదలైన `బిల్లా`… నేటితో 11 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: