మహేష్ ను డైరెక్ట్ చేయాలనుంది..!

I Want To Direct Super Star Mahesh Babu Says Hit Fame Vishwak Sen

‘వెళ్ళి పోమాకే’ చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై… ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయి ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంతో తానే నటుడిగా.. దర్శకుడిగా పక్కా హైదరాబాదీ నేటివిటీతో సినిమాను తీసి.. తన బోల్డ్ నెస్ తో తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు ఫలక్‌నుమా దాస్ అదే యాక్టర్ విశ్వక్ సేన్. ఇక రీసెంట్ గా నాని నిర్మాతగా రూపొందించిన ‘హిట్’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి హిట్ కొట్టాడు. దీనితో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు విశ్వక్ సేన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న విశ్వక్ సేన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తన సినీ ప్రయాణం.. చిన్ననాటి ప్రేమ, సినిమాలు, ఇలా అన్ని విషయాల గురించి చెప్పాడు. తనకు మహేష్ బాబును డైరెక్ట్ చేయాలనుందని చెప్పాడు. `నేను చిన్నతనం నుంచి మహేష్ బాబు సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనకు నేను చాలా పెద్ద అభిమానిని… ఇప్పుడు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం.. కానీ మహేష్ ను డైరెక్ట్ చేయాలనుందని.. తప్పకుండా ఏదో ఒక రోజు మహేష్ బాబును డైరెక్ట్ చేస్తా`నని చెప్పాడు. అంతేకాదు భవిష్యత్తులోనూ డైరెక్టర్‌గా కొనసాగే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం హీరోగా కొనసాగుతూనే కొన్ని స్క్రీప్ట్స్ మీద కూడా వర్క్ చేస్తున్నాడట విశ్వక్. అంతేకాదు హిందీలోనూ సినిమాను రూపొందించే ఆలోచనలో ఉన్నానని తెలిపాడు. మరి చూద్దాం మహేష్ ను డైరెక్ట్ చేసే రోజు ఎప్పుడు వస్తుందో..

కాగా ప్రస్తుతం విశ్వక్ నరేష్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్ ప్రారంభించలేదు. ఈ వైరస్ గోల అయిపోయిన తర్వాత శరవేగంగా షూటింగ్ ను జరపనున్నారు. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో బెంగళూరు బ్యూటీ క్రితి శెట్టి హీరోయిన్‌గా నటించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + thirteen =