స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ‘ఆర్య’తో తెలుగునాట దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్. అంతేకాదు… మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు కూడా. అనంతరం బన్నీ కాంబినేషన్లో వచ్చిన మ్యూజికల్ హిట్ ‘ఆర్య 2’తో ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేశాడు. కట్ చేస్తే… పదేళ్ళ విరామం అనంతరం ముచ్చటగా మూడోసారి తన లక్కీ హీరో కాంబోలో ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధపడుతున్న సుక్కు… ఈసారి కూడా తన గత సినిమాల సెంటిమెంట్‌నే కంటిన్యూ చేయనున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేమిటంటే… బన్నీ కాంబోలో గత రెండు చిత్రాలకు రెండక్షరాల శీర్షికలే పెట్టి హిట్ కొట్టిన ఈ లెక్కల మాస్టర్… థర్డ్ జాయింట్ వెంచర్ కి కూడా అదే తరహాలో రెండక్షరాల టైటిల్‌ను ఎంపిక చేసే దిశగా ఆలోచిస్తునట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఓ క్లారిటీ వచ్చిందని… అమ్మాయి పేరు ధ్వనించేలా టైటిల్ ఉండబోతోందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ నెల 8న బన్నీ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ను ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలిసింది.
అన్నట్టు… ‘ఆర్య’, ‘ఆర్య2’తో పాటు బన్నీ నటించిన `బన్నీ`, ‘హ్యాపీ’, ‘వేదం’, `డీజే` కూడా రెండక్షరాల టైటిల్స్ కావడం విశేషం. అంతేకాదు… ఆ యా చిత్రాలు బన్నీ కెరీర్‌కు బాగానే ప్లస్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే బన్నీ, సుక్కు మూవీ టైటిల్ పై అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది. మరి.. టైటిల్ ఏంటో తెలియాలంటే మరో ఐదు రోజులు వేచిచూడాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: