అజయ్ దేవగన్ కు “RRR”మూవీ యూనిట్ శుభాకాంక్షలు

RRR Movie Team Greets Birthday Wishes To Ajay Devgn

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం” మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అజయ్ దేవగన్ పాల్గొన్న ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈరోజు బర్త్ డే సందర్భంగా అజయ్ దేవగన్ కు “RRR”మూవీ యూనిట్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. సహృదయుడు అజయ్ దేవగన్ కు హ్యాపీ బర్త్ డే అని, మీరు “రౌద్రం రణం రుధిరం” మూవీ లో ఒక పార్ట్ అయినందుకు గొప్ప గౌరవం గా భావిస్తున్నామని, మీరు పాల్గొన్న షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ మర్చిపోలేని ఎక్స్ పీరియన్స్ అని, మీరు కూడా అలాగే భావిస్తున్నారని ఆశిస్తున్నాం అంటూ “RRR”మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. బ్లాక్ బస్టర్ “బాహుబలి” మూవీ తరువాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం” మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =