స్టార్ రైటర్‌ అబ్బూరి రవికి మాతృ వియోగం

Star Writer Abburi Ravi Mother Passes Away,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Latest Tollywod News,Abburi Ravi Mother,Abburi Ravi Mother Passed Away,Abburi Ravi Mother No More,Abburi Ravi Mother RIP

స్టార్ రైటర్‌ అబ్బూరి రవి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి లలిత (73) నిన్న తుది శ్వాస విడిచారు. వయసు రీత్యా గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆమె.. నిన్న సాయంత్రం గుండె పోటుతో మరణించారు. ఈరోజు ఫిలిం నగర్ లోని మహాప్రస్థానంలో ఆమె అంత్య క్రియలు నిర్వహించారు. ఇక ఆమె మృతిపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ అబ్బూరి రవికి.. అతని కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.

2003లో ‘ఎలా చెప్పను’ చిత్రంతో రైటర్‌గా మారిన ఈయన.. బొమ్మరిల్లు, కిక్, మిస్టర్ పర్ఫెక్ట్, ఎవడు, క్షణం, ఊపిరి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటు ఇటీవల విడుదలైన అడవి శేష్ ‘గూఢచారి’ చిత్రానికి సంభాషణలు అందించారు. తన పెన్నుతో పవర్ ఫుల్ డైలాగ్‌లతో పాటు ఎమోషనల్ పంచ్‌లు పేల్చడంలో దిట్ట. అంతేకాదు ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ అనే సినిమాలో విలన్‌గా కూడా నటించాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here