మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన పలు చారిత్రాత్మక చిత్రాలు ప్రేక్షకులను అలరించడమే కాదు… వాటిలో కొన్ని చిరస్థాయిగా నిలచిపోయాయి కూడా. అటువంటి చిత్రాల్లో ‘మహాకవి కాళిదాసు’ ఒకటి. “పౌరాణిక బ్రహ్మ” కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఏయన్నార్‌కు జోడిగా జూనియర్ శ్రీరంజని నటించారు. యస్.వి.రంగారావు, సి.యస్.ఆర్, రేలంగి, వంగర, ముదిగొండ లింగమూర్తి, రాజసులోచన, సంధ్య, వాసంతి తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. కన్నడ మూవీ ‘మహాకవి కాళిదాస’(1955)కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరెకెక్కించారు దర్శకులు కమలాకర కామేశ్వరరావు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పింగళి నాగేంద్రరావు కలం నుంచి జాలువారిన పాటలకు… పెండ్యాల నాగేశ్వరరావు స్వరాలు సమకూర్చారు. ముఖ్యంగా… కాళిదాసు రచించిన “మాణిక్యవీణా” అనే పాట బాగా ప్రాచుర్యం పొందింది. దీంతో పాటు… “నీ కెట్టుందోగాని పిల్ల”, “వెలుగు వెలగరా నాయనా”, “రసికరాజా”, “ఆ మాటంటే”, “జయ జయ శారద” వంటి గీతాలు కూడా శ్రోతలను అలరించాయి. సారణి ప్రొడక్షన్స్ పతాకంపై కె.నాగమణి, పి.సూరిబాబు నిర్మించిన ఈ సినిమాని… తమిళంలో ‘మహాకవి కాళిదాస్’(శివాజీ గణేశన్) పేరుతో పునర్నిర్మించడం విశేషం. 1960 ఏప్రిల్ 2న విడుదలై అఖండ విజయం సాధించిన ‘మహాకవి కాళిదాసు’… నేటితో ఆరు దశాబ్దాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: