తన అందం, అభినయంతో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న అమలా పాల్ ఈ మధ్య వక్తిగత జీవితం వల్ల ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. మొదటి పెళ్లితో మొదలైన ఈ రచ్చ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఇక ఇటీవలే రెండో పెళ్లితో మరోసారి వార్తల్లో నిలిచింది. రెండో పెళ్లి, తాను చేసిన ఫొటోలపై జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. మళ్లీ ఆ ఫోటోలన్నీ డిలీట్ చేయడం, తాను అసలు పెళ్లే చేసుకోలేదని చెప్పడం ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆమె చేసిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. అయితే ఈసారి ఏ కాంట్రవర్సీకి సంబంధించిన పోస్ట్ కాదులెండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గతేడాది అమలా పాల్ నాన్న అనారోగ్యంతో చనిపోయిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై భావోద్వేగంతో అమలా పాల్ ఒక పోస్ట్ చేసింది. తల్లిదండ్రులను కోల్పోవడమనేది అత్యంత బాధాకరమైన విషయం. క్యాన్సర్తో నా తండ్రి మరణించడం నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ ఘటనతోనే లైఫ్ అంటే ఏంటో అర్థమైంది.. అక్కడే జీవితమంటే ఏంటో తెలసుకున్నాను. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని మనం ప్రేమించుకోవడమే మరిచిపోతాము. అసలు దాని గురించి పట్టించుకోము కూడా. మన గురించి.. మన భావాల గురించి.. మనం ఆలోచించే తీరిక కూడా ఉండదు.. వాటి బాధను కూడా పట్టించుకోము. మనం బతకడం కోసం, ఓ తోడు కావాలని బంధాలను మార్చుకుంటూ వెళ్తుంటాము. కెరీర్, మనుషులు, బంధాలు అంటూ పరిగెత్తుతూ.. మనల్ని మనం కోల్పోతున్నాము. ఎప్పుడైతే మనల్ని మనం పూర్తిగా ప్రేమించడం ప్రారంభిస్తామో అప్పుడు భయం, వెలుతురు, చీకటి, సంతోషం, వంటివి ఏవీ ప్రభావితం చేయలేవు.ఇక నుంచి పారిపోకూడదని అనుకుంటున్నా.. దైర్యంగా ముందుకు నడవాలని నేను నిశ్చయించుకున్నా. నేను మొత్తం కోల్పోయాను.. అలాగే మా అమ్మ కూడా డ్రిపెషన్లోకి వెళ్లిపోయింది. అయినా మేము ఫినిక్స్ పక్షుల్లా ఎగరడానికి ప్రయత్నిస్తున్నాము అని చాలా సుదీర్ఘంగానే రాసుకొచ్చింది. మొత్తానికి ప్రస్తుతం తను ఎదుర్కొంటున్న పరిస్థితుల వల్ల బాగానే డిస్టర్బ్ అయినట్టుంది అమలా పాల్.
Amala Paul Aame Movie Back to Back Best Scenes | 2019 Latest Telugu Movies | Telugu Filmnagar
15:33
Aame Movie Thrilling Scene | 2019 Telugu Movies | Amala Paul | Ramya Subramanian | Telugu FilmNagar
03:32
Mohanlal Slaps Amala Paul | Black Money Latest Telugu Movie Scenes | Gopi Sundar |Telugu FilmNagar
15:31
Amala Paul EMOTIONAL Speech | Aame Press Meet | Tammareddy Bharadwaj | Amala Paul | Telugu FilmNagar
06:04
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: