రెండు తరాల నంబర్ వన్ కథానాయకులు ఒకే సినిమా కోసం స్క్రీన్ షేర్ చేసుకోవడం అరుదైన విశేషం. అలాంటి… విశేషానికి చిరునామాగా నిలిచిన ఆ చిత్రం `తిరుగులేని మనిషి` కాగా… ఆ రెండు తరాల నంబర్ వన్ కథానాయకులు మహానటుడు నందమూరి తారక రామారావు, మెగాస్టార్ చిరంజీవి. వీరిద్దరూ బావ, బావమరిది పాత్రల్లో దర్శనమిచ్చిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించారు. యన్టీఆర్‌కి జోడిగా రతి అగ్నిహోత్రి, చిరుకి జంటగా “ఫటాఫట్” జయలక్ష్మి నటించిన ఈ సినిమాలో సత్యనారాయణ, జగ్గయ్య, అల్లు రామలింగయ్య, ముక్కామల తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
`మనసు కవి` ఆచార్య ఆత్రేయ గీత రచన చేయగా… దిగ్గజ స్వరకర్త కె.వి.మహదేవన్ బాణీలు అందించారు. “యవ్వనం ఒక నందనం”, “మధురం మధురం”, “రావమ్మ రావమ్మ”, “నిన్ను పుట్టించినోడు”, “ఎంతసేపు ఎంతసేపు”, “బరిలోకి దిగినా”… వంటి పాటలు ప్రేక్షకులను అలరించాయి. రేర్ కాంబినేషన్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన ఈ చిత్రాన్ని దేవీ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై కె.దేవీ వరప్రసాద్ నిర్మించారు. 1981 ఏప్రిల్ 3న విడుదలైన ‘తిరుగులేని మనిషి’… నేటితో 39 వసంతాలను పూర్తి చేసుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: