బ్రదర్ నిన్ను చాలా మిస్ అవుతున్నా..!

Actress Tamannaah Missing Her Brother During The Lockdown

ఈ కరోనా వైరస్ ఏమో కానీ ఒక్కసారిగా ప్రపంచం మొత్తం ఇంటికే పరిమితమైంది. ఈ వైరస్ సంగతి పక్కన పెడితే.. ఇంటికి కుటుంబానికి కాస్త టైమ్ కూడా కేటాయించలేని.. బిజీ బిజీ జీవితం గడుపుతున్న వాళ్లకు మాత్రం నిజంగా ఇది గుడ్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే…ఈ రకంగా అయినా కాస్త కుటుంబంతో కలిసి గడిపే అవకాశం దక్కింది. ఇక నాణానికి ఇది ఒక కోణం అయితే మరో కోణం కొంత మంది ఇంటికి వెళ్లలేని పరిస్థితి. ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాల్సిన పరిస్థితి. దీనితో చాలా మంది కుటుంబాలకు దూరంగా ఉంటూ బాధపడే వాళ్ళు కూడా వున్నారు. ఈ నేపథ్యంలో ఒక స్టార్ హీరోయిన్ కూడా ఈ లాక్ డౌన్ వల్ల తన బ్రదర్ ను బాగా మిస్ అవుతుందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు తమన్నా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ లు కూడా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇంట్లోనే ఉన్న తమన్నా.. యూఎస్‌ఏలో ఉన్న తన బ్రదర్ ఆనంద్‌ను ఎంతగానో మిస్ అవుతున్నా అంటూ.. కొన్ని త్రో బ్యాక్‌ ఫోటోస్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది. `ఈ రోజు ఇంటిని శుభ్రం చేస్తుంటే నాకు నా చిన్ననాటి ఫోటోలతో ఉన్న ఈ ఆల్బమ్‌ దొరికింది.ఆ తరువాత సమయమంతా ఆ ఫోటోలను చూస్తూ ఆ మెమరీస్‌ గుర్తు చేసుకుంటూ గడిపేసా`..అంతే కాదు ఈ లాక్‌ డౌన్‌ పీరియడ్‌లో నువ్వు కూడా ఇండియాలో ఉంటే బాగుండేది ఆనంద్ భాటియా అంటూ కామెంట్ చేసింది కాస్త భావోద్వేగం అయింది.

 

ఇక లాక్ డౌన్ లో అందరి సెలెబ్రిటీస్ లాగానే తమన్నా కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. తన కుకింగ్ వీడియోస్, వర్క్ అవుట్ వీడియోస్ ఇలాఏదో ఒక వీడియో ద్వారా యాక్టీవ్ లోనే ఉంటుంది. ప్రస్తుతం తమన్నా గోపీచంద్ సరసన ‘సీటిమార్’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో లేడీ కబడ్డీ కోచ్ గా తమన్నా నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 16 =