వెండి తెర, బుల్లి తెర.. తెర ఏదైనా… ఆర్టిస్ట్ అవ్వడం అనేది అందరికీ అంతా ఈజీ కాదు. బ్యాక్ గ్రౌండ్ ఉంటే పర్లేదు కానీ.. లేకుండా మాత్రం ఒక స్థాయికి రావాలంటే మాత్రం ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆలా వాటిని ధైర్యంగా ఎదుర్కొన్న వాళ్లే సక్సెస్ అవ్వగలరు. అలా ఎన్నో కష్టాలు ఎదుర్కొని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది సీరియల్ నటి రాగిణి. రాగిణి… సీరియల్స్ చూసే వారికి పరిచయం అక్కర్లేని పేరు. తల్లిగా, చెల్లిగా, వదినగా, విలన్ గా ఒకటి ఎన్నో పాత్రల్లో నటించిన రాగిణి ఒకటి కాదు రెండు కాదు దాదాపు 550 పైగా సీరియల్స్ లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక సినిమాల్లో కూడా 190 పైగా సినిమాల్లో నటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తానూ కూడా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని.. తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. మేము మొత్తం 13 మంది. నేను 12వ సంతానం…అప్పట్లో కుటుంబ పోషణకోసం హైదరాబాద్లో డాన్స్ గ్రూపుల్లో నెల అంతా కష్టపడితే మూడువేల రూపాయలు వచ్చేవి. వాటితోనే కుటుంబపోషణ చూసుకోవాల్సి వచ్చేది.. ఆ టైంలో హీరోయిన్ అయ్యే అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ తగిన ప్రోత్సాహం ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే మిగిలిపోవాల్సి వచ్చింది అని తెలిపింది. అంతే కాదు ‘నాకు 12 ఏళ్లు వయసప్పుడే పెళ్లి చేశారు. ఒక సంవత్సరం ఏమో బావున్నాం.. ఏడాదిలో నాకు ఒక బాబు పుట్టాడు… ఆ తర్వాత తను డబ్బులు కోసం ఏమైనా చేయి.. ఎవరిదగ్గరికైనా వెళ్లి సంపాదించు అనేవాడు.



దానితో నేను అతడి నుండి విడిపోయా అని చెప్పింది. ఇక నాకు పుట్టిన కొడుకుని అక్క పిల్లలుగా పెంచడంతో వాడు కూడా నన్ను అక్కా అనే అంటాడు. అమ్మ అని అనడు. కానీ తనకు నేనే అమ్మ అని తెలుసు… జర్మనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. నన్ను బాగా చూసుకుంటాడని చెప్పింది. అంతేకాదు ఇండస్ట్రీ లో పరిస్థితులు ఎలా వుంటాయో కూడా చెప్పారు. మరి మనకి చూడటానికి రంగుల ప్రపంచంలా కనిపించినా.. ఆ రంగుల ప్రంపంచం వెనుక ఎన్ని ఇబ్బందులు.. సమస్యలు వుంటాయో అవి చూసిన వాళ్ళకే తెలుస్తుంది కదా…
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























