‘సాయం’ లో కూడా సింప్లిసిటీ..!

Director Sekhar Kammula Once Again Proves His Generosity
Director Sekhar Kammula Once Again Proves His Generosity

టాలీవుడ్ డైరెక్టర్స్ లో శేఖర్ కమ్ముల స్టైల్ వేరని ప్రేత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ద హడావుడి లేకుండా చాలా సింపుల్ గా ఉంటాడు. ఆయన సినిమాలు సహజత్వాన్ని చాలా దగ్గరగా ఉంటాయి. ఇక ఇదిలా ఉండగా సాయం చేయడంలో కూడా ఆయన తన సింప్లిసిటీ చూపించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా వల్ల లాక్ డౌన్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ నివారణ చర్యల్లో భాగంగా… ఇప్పటీకే ఎంతోమంది ముందుకొచ్చి విరాళాలు ఇస్తూనే వున్నారు. ఇక మన టాలీవుడ్ నుండి కూడా ఎంతో మంది హీరోలు, డైరెక్టర్ లు భారీ విరాళాలే ఇచ్చారు. అయితే ఏ హీరో ఎంత ఇచ్చాడు.. ఏ డైరెక్టర్ ఎంత ఇచ్చాడు అన్నది ఏదో ఒకరకంగా బయటకొస్తుంది. అయితే శేఖర్ కమ్ముల కూడా లాక్ డౌన్ వల్ల నిస్సహాయులుగా మారిన ట్రాన్స్ జెండర్లకు సాయం చేశాడు. అయితే ఈ విషయం మాత్రం ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు.అయితే ఈ విషయాన్నీ స్వయంగా ఓ ట్రాండ్ జెండర్ సోషల్ మీడియా ద్వారా తన కమ్యూనిటీ తరుపున ఈ విషయాన్ని తెలియజేసింది. అవసరమైన వారికి సాయం చేయడంలో శేఖర్ సర్ ముందుటారని మరోసారి నిరూపించుకున్నారు. టాలీవుడ్ నుంచి మరింతమంది తమని ఆదుకుంటారని భావిస్తున్నట్లు రచన అనే ట్రాన్స్ జెండర్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. మరి సాయం చేసి కూడా చెప్పుకోకపోవడం గొప్ప విషయమే కదా.

ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైత‌న్య, సాయి పల్లవి  ప్రధాన పాత్రల్లో ‘ల‌వ్ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉండగా.. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. కాగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − five =