కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 135

Gang Leader Actress Priyanka Arul Mohan Ready To Act In Bold Scenes In Andhadhun Telugu Remake
సినిమా వార్తలు

నితిన్ తో బోల్డ్ సీన్స్ నటించేందుకు రెడీ అయిన నాని హీరోయిన్..!

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ 'అంధాదున్' సినిమా రీమేక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను సైతం పూర్తిచేసుకోగా... షూటింగ్ మొదలు పెడదాం అనుకునేలోపు కరోనా వల్ల బ్రేక్ పడింది. అందులో గుడ్డివాడి పాత్రలో నితిన్ నటించబోతున్నాడు. దీనికోసం నితిన్ ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంటున్నాడట.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"రౌడీ" తో నటించాలని ఉంది - పాయల్ రాజ్ పుత్

మరాఠీ సూపర్ హిట్ "సైరాత్ " మూవీ పంజాబీ రీమేక్ "చెన్న మేరియా "మూవీ తో సినీకెరీర్ ప్రారంభించిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ సెన్సేషనల్ హిట్ "RX 100" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పాయల్ తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్నారు. "వెంకీ మామ ", డిస్కో రాజా " మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన పాయల్ ప్రస్తుతం ఒక తెలుగు మూవీ లో నటిస్తున్నారు. "ఏంజెల్ " తమిళ మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘ఘటోత్కచుడు’కు 25 ఏళ్ళు

‘యమలీల’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత అలీ హీరోగా ఎస్.వి.కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన మరో సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘ఘటోత్కచుడు’. కైకాల సత్యనారాయణ టైటిల్ రోల్‌లో నటించిన ఈ చిత్రంలో రోజా, బేబీ నిఖిత, ఏ.వి.య‌స్, శరత్ బాబు, సుధ, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, చలపతిరావు, తనికెళ్ళ భరణి, గిరిబాబు, ప్రసాద్ బాబు, శివాజీరాజా, రాళ్ళపల్లి, గుండు హనుమంతరావు, శ్రీలక్ష్మి, టిను ఆనంద్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ‘కింగ్’ నాగార్జున, డా.రాజశేఖర్, శ్రీకాంత్ అతిథి పాత్రల్లో దర్శనమిచ్చారు.

Team TFNవాట్సాప్
NTR and ANR Evergreen Classic Palletoori Pilla Completes 70 Years.
సినిమా వార్తలు

యన్టీఆర్, ఏయన్నార్ తొలి మల్టీస్టారర్ ‘పల్లెటూరిపిల్ల’కు 70 ఏళ్ళు

మహానటులు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు కాంబినేష‌న్‌లో పలు మల్టీస్టారర్ మూవీస్ తెరకెక్కాయి. కాగా, ఈ తరహా చిత్రాలకు శ్రీకారం చుట్టిన సినిమాగా ‘పల్లెటూరిపిల్ల’కు ప్ర‌త్యేక స్థానముంది. అంజలీదేవి టైటిల్ రోల్‌లో న‌టించిన ఈ చిత్రంలో ఎస్.వి.రంగారావు, ఎ.వి.సుబ్బారావు, కోటేశ్వరరావు, లక్ష్మీకాంత, హేమలత, బాల సరస్వతి, బేబీ మల్లిక ముఖ్య భూమికలు పోషించారు. శోభనాచల & బి.ఎ.సుబ్బారావు జాయింట్ వెంచర్ పతాకంపై బి.ఎ.సుబ్బారావు ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరోసారి రాజ్ తరుణ్, అవికా గోర్ జోడీ?

2013లో విడుదలైన 'ఉయ్యాలా జంపాలా’తో నాయకానాయికలుగా తొలి అడుగులేశారు రాజ్ తరుణ్, అవికా గోర్. మొదటి సినిమాతోనే ఈ జంట బ్లాక్ బస్టర్ హిట్‌ని తమ ఖాతాలో వేసుకుంది. ఆపై మరో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సినిమా చూపిస్త మావ’(2015)తో మరో ఘనవిజయాన్ని నమోదు చేసుకున్నారు. కట్ చేస్తే.. ఐదేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం ఈ హిట్ పెయిర్ ముచ్చ‌ట‌గా మూడోసారి జట్టుకట్టేందుకు సిద్దమవుతోందని సమాచారం.

Team TFNవాట్సాప్
Victory Venkatesh Wholesome Family Entertainer Aadavari Matalaku Arthale Verule Completes 13 Years, Latest Telugu Movie News, Latest Tollywood News, Telugu Film News 2020, Tollywood Movie Updates, Telugu Filmnagar, Aadavari Matalaku Arthale Verule Mo
సినిమా వార్తలు

వెంక‌టేష్ ‘ఆడవారిమాటలకు... అర్థాలేవేరులే!’కి 13 ఏళ్ళు

కుటుంబ క‌థా చిత్రాల‌కు చిరునామాగా నిలచిన క‌థానాయ‌కుల్లో విక్టరీ వెంకటేష్‌ ఒకరు. ఆయ‌న న‌టించిన ప‌లు ఫ్యామిలీ డ్రామాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. వాటిలో ‘ఆడవారిమాటలకు… అర్థాలేవేరులే!’ ఒకటి. ఇందులో వెంకీ సరసన త్రిష కథానాయికగా న‌టించ‌గా… కోట శ్రీనివాస రావు, శ్రీరామ్, కె.విశ్వనాథ్, సునీల్, జీవా, ‘క‌ల‌ర్స్‌’ స్వాతి, రాజ్యలక్ష్మి, ప్రసాద్ బాబు ముఖ్య భూమికలు పోషించారు. మేఘ‌నా నాయుడు, ముమైత్ ఖాన్ ప్ర‌త్యేక గీతాల్లో మెరిశారు. శ్రీరాఘవ (సెల్వరాఘవన్) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్రసాద్, ఎస్.నాగ అశోక్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు.

Team TFNవాట్సాప్
Nandamuri Balakrishna Musical Blockbuster Nari Nari Naduma Murari Completes 30 Years, Nandamuri Balakrishna, Nari Nari Naduma Murari Movie Completes 30 Years, Nari Nari Naduma Murari, Nari Nari Naduma Murari Telugu Movie, Balakrishna Nari Nari Naduma
సినిమా వార్తలు

బాలకృష్ణ 50వ చిత్రం 'నారీ నారీ నడుమ మురారి’కి 30 ఏళ్ళు

నటసింహ నందమూరి బాలకృష్ణకి అచ్చొచ్చిన నిర్మాతల్లో 'యువ చిత్ర' అధినేత కె.మురారి ఒకరు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన రెండు చిత్రాలు ఇటు కమర్షియల్‌గానూ, అటు మ్యూజికల్‌గానూ మంచి స‌క్సెస్ సాధించాయి. వాటిలో ఒకటి ‘సీతారామకళ్యాణం’ కాగా, మరొకటి 'నారీ నారీ నడుమ మురారి’.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాగార్జున ‘ఘరానా బుల్లోడు’కి 25 ఏళ్ళు

‘కింగ్’ నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కలయికలో పలు మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ తెరకెక్కాయి. వాటిలో ‘ఘరానా బుల్లోడు’ ఒకటి. నాగ్ సరసన రమ్యకృష్ణ, ఆమని కథానాయికలుగా నటించగా.. జయచిత్ర, మురళీమోహన్, సుధ, జయంతి, తనికెళ్ళ భరణి, సుధాకర్, బ్రహ్మానందం, నూతన్‌ప్రసాద్, ఏవీయస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, మ‌హేష్ ఆనంద్, శ్రీ‌హ‌రి ముఖ్య పాత్రలు పోషించారు.

Team TFNవాట్సాప్
Vishwak Sen Blockbuster Movie HIT Goes To Bollywood, Vishwak Sen Blockbuster Movie HIT, HIT Movie Goes To Bollywood, Vishwak Sen, HIT Telugu Movie Remake in Bollywood, Vishwak Sen HIT Movie, HIT, HIT Movie, Vishwak Sen Latest News 2020, Vishwak Sen U
సినిమా వార్తలు

"HIT" మూవీ హిందీ రీమేక్ ?

టాలీవుడ్ హిట్ మూవీస్ ను హిందీ లో రీమేక్ చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ తెలుగు మూవీ "అర్జున్ రెడ్డి " హిందీ రీమేక్ "కబీర్ సింగ్" మూవీ ఘనవిజయం సాధించడంతో పలు తెలుగు మూవీస్ హిందీ లో రీమేక్ కానున్నాయి. "జెర్సీ " , RX 100" , "ఎవడు", "డియర్ కామ్రేడ్ ", "ఇస్మార్ట్ శంకర్" హిందీ రీమేక్ మూవీస్ ఉత్తరాదిప్రేక్షకులను అలరించనున్నాయి. ఈ మూవీస్ తోపాటు "HIT" మూవీ కూడా హిందీలో రీమేక్ కానుందని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నితిన్‌కి జోడిగా ప్రియాంకా అరుళ్‌ మోహన్?

'భీష్మ'తో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేసాడు యువ కథానాయకుడు నితిన్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. వాటిలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'అంధాదున్' ఒకటి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలకృష్ణ తో సినిమా చేయాలనుకున్నా కానీ..!

ఒక డైరెక్టర్ కు అందరు హీరోలతో సినిమాలు చేయాలని ఉంటది. ఇక అందరు హీరోలకు కూడా ప్రతి డైరెక్టర్ తో సినిమా చేయాలనుకుంటారు. ఎందుకంటే ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో స్టైల్ ఉంటది... ఒక్కో హీరో కి ఒక్కో స్టైల్ ఉంటది. కాబట్టి తమని తాము కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రాజమౌళి కూడా అగ్ర హీరో అయిన బాలకృష్ణ తో సినిమా చేయాలనుకున్నాడట కానీ కుదరలేదట. ఈ విషయాన్ని జక్కన్న స్వయంగా తానే చెప్పాడు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

"క్రాక్ " మూవీ సముద్ర ఖని ఫస్ట్ లుక్

సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవి తేజ, శృతి హాసన్ జంటగా యాక్షన్ థ్రిల్లర్ "క్రాక్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నిజ జీవిత సంఘటనలతో రూపొందుతున్న ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని, అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. ఈ మూవీ లో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మాస్ మహారాజా సరసన నివేత పెతురాజ్?

'రాక్షసుడు'(2019) రూపంలో కెరీర్ బెస్ట్ హిట్‌ని అందుకున్నాడు దర్శకుడు రమేష్ వర్మ. త్వరలో మరో యాక్షన్ థ్రిల్లర్‌తో పలకరించబోతున్నాడు. ఇందులో మాస్ మహరాజా రవితేజ కథానాయకుడిగా నటించనున్నాడు. 'వీర'(2011) తరువాత రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.

Team TFNవాట్సాప్
Power Star Pawan Kalyan Sensational Hit Movie Kushi Turns 19
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ ‘ఖుషి’కి 19 ఏళ్ళు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌గా నిలిచిన చిత్రం ‘ఖుషి’. కథానాయకుడిగా వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న పవన్ స్థాయిని అమాంతం పెంచిన సినిమా ఇది. ఆబాల‌గోపాలాన్ని అలరించిన ఈ చిత్రంలో పవన్‌కు జోడిగా భూమికా చావ్లా నటించింది. శివాజీ, నాజర్, విజయ్ కుమార్, సుధ, అలీ, రాజన్ పి.దేవ్, ముంతాజ్, జానకి సబేష్, అజయ్ ముఖ్య భూమికలు పోషించారు. టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్.జె.సూర్య ఈ మూవీని తెరకెక్కించ‌డ‌మే కాకుండా.. క‌థ‌ను మ‌లుపుతిప్పే పాత్ర‌లోనూ దర్శనమిచ్చాడు. తమిళ చిత్రం ‘ఖుషి’కి రీమేక్‌గా రూపొందిన ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ప్ర‌ముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మించాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

టాలీవుడ్ భారీ ఆఫర్స్

బ్లాక్ బస్టర్ "భరత్ అనే నేను" మూవీ తో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ టాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. కియారా నటించిన రెండవ సినిమా నిరాశపరచినా , సూపర్ హిట్ "అర్జున్ రెడ్డి" మూవీ హిందీ రీమేక్ "కబీర్ సింగ్" మూవీలో హీరోయిన్ గా నటించగా ఆ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బ్లాక్ బస్టర్ హిందీ మూవీ "గుడ్ న్యూస్ " తో కియారా అద్వానీ బాలీవుడ్ లో బిజీగా మారారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పవన్ చిత్రంలో శివ కార్తికేయన్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో ఓ పిరియాడిక్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొఘలాయల కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నాడు.

Team TFNవాట్సాప్
Be The Real Man Challenge Goes Beyond Tollywood
సినిమా వార్తలు

బాలీవుడ్, మాలీవుడ్ కు వెళ్లిన మన 'బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్..!

సందీప్ వంగా మొదలు పెట్టిన బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే అగ్ర హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకూ.. పలువురు డైరెక్టర్స్ వరకు వెళ్ళింది. ఇక ఇన్నిరోజులు అల్లు అర్జున్.. ప్రభాస్ మిస్ అవుతున్నారు అనుకునేలోపు రాజమౌళి ఛాలెంజ్‌ని స్వీకరించిన బాహుబ‌లి నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ టాస్క్ పూర్తి చేసి... త‌ర్వాత ఆయ‌న ఈ ఛాలెంజ్‌ని ప్ర‌భాస్‌కి, అల్లు అర్జున్‌కి విసురుతున్న‌ట్టు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక వీళ్ళు కూడా అయిపోయారు. ఇంకా కొంత మంది యంగ్ హీరోస్ మిగిలారు.

TFN Adminవాట్సాప్
Bobby Simha in Allu Arjun's Pushpa movie?
సినిమా వార్తలు

పుష్ప సినిమాలో టాలెంటెడ్ నటుడు బాబి సింహా..?

అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ తోనే అల్లు అర్జున్ సోషల్ మీడియాలో రికార్డ్స్ ను క్రియేట్ చేశాడు. ఇక ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి విదితమే. ఓ అటవీశాఖ అధికారి పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు అన్నారు. అయితే ఇటీవల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్‌ సేతుపతి ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
Director Teja Blockbuster Movie Jayam Goes To Sandalwood After 18 Years
సినిమా వార్తలు

18 ఏళ్ల తర్వాత జయం రీమేక్..!

తేజ దర్శకత్వంలో నితిన్, సదా జంటగా నటించిన ‘జయం’ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తేజ డైరెక్షన్‌లో ఆర్పీ పట్నాయక్ సంగీతంతో అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్‌ను కుదిపేసింది. ఈ సినిమా తేజ, నితిన్, సదా, ఆర్పీకి వరుస అవకాశాలు వచ్చేలా చేసింది. ఇక హిట్ అయిన సినిమాను రీమేక్ చేయడం తెలిసిన సంగతే కదా. ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో తమిళంలో రీమేక్ చేశారు. తమిళంలో రవి, సదా జంటగా నటించారు. అక్కడ కూడా సినిమా సూపర్ హిట్టే. ఆ సినిమాతో రవి కాస్త జయం రవిగా ముద్ర పడిపోయింది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

హైదరాబాద్ లో "ఫైటర్ " మూవీ షూటింగ్ ?

పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా యాక్షన్ థ్రిల్లర్ "ఫైటర్"(వర్కింగ్ టైటిల్ ) మూవీ తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కై విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ పొందారు. ఈ పాన్ ఇండియా మూవీ లో బాలీవుడ్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ అనన్య పాండే కథానాయిక. మణిశర్మ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్

షేర్