నరేష్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ ‘నాంది’ అనే డిఫరెంట్ స్టోరీ తో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. రెండవ షెడ్యూల్ షూటింగును ఈ రోజున మొదలెట్టారు.అయితే ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల షూట్ కు బ్రేక్ పడింది. కాగా ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సతీష్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ నేపథ్యంలో నరేష్ మాట్లాడుతూ.. ‘నాంది’ చిత్రం నా కెరియర్ లోనే ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని భావిస్తున్నానని తెలిపాడు. అంతేకాదు ఈ సినిమా నాకు తప్పకుండా మంచి హిట్ ఇస్తుందని.. హీరోగా మళ్లీ నేను బిజీ అవుతాననే నమ్మకం ఏర్పడింది. మొదటి నుంచి ఎక్కువగా హాస్య పాత్రలు చేస్తూ రావడం వల్ల ఇతర ముఖ్యమైన పాత్రలకు ఎవరూ పిలవడం లేదు. కానీ నాకు నెగెటివ్ క్యారెక్టర్లు కూడా చేయాలని వుంది. అంతేకాదు వెబ్ సిరీస్ లలోను నటించడానికి నేను సిద్ధంగానే వున్నానని తన అభిప్రాయాన్ని తెలిపాడు. మరి ఈ మాట డైరెక్టర్స్ కు వినిపిస్తే అల్లరి నరేష్ కోసం విలన్ క్యారెక్టర్ రాస్తారేమో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























