ఆస్కార్ అవార్డ్స్ పై రాజమౌళి స్పందన

Tollywood Ace Director SS Rajamouli Shares An Interesting Insight About Oscar Award Winning Movies

మూవీ అవార్డ్స్ లో ఆస్కార్ అవార్డ్స్ కు ఒక ప్రత్యేకత ఉంది. మూవీ లోని పలు విభాగాలకు ఆస్కార్ అవార్డ్స్ అందజేయబడతాయి. 2020 సంవత్సరంలో “పారసైట్ ” మూవీ ఉత్తమచిత్రం తోపాటు దర్శకుడు, స్క్రీన్ ప్లే విభాగాలలో ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకుంది. “పారసైట్ ” మూవీ ని వీక్షించిన దర్శకుడు రాజమౌళి తనకు స్లో గా ఉండే మూవీస్ నచ్చవని, బోర్ కొట్టిందని, ఆ మూవీ చూస్తూ పడుకుండిపోయానని కామెంట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న “పారసైట్ ” మూవీ పై నెగటివ్ కామెంట్స్ చేసిన రాజమౌళిని సోషల్ మీడియా లో పలువురు ట్రోల్ చేశారు. టాప్ డైరెక్టర్ రాజమౌళి అలా మాట్లాడడం సరికాదనడం తో రాజమౌళి ఆస్కార్ అవార్డ్స్ పై సంచలన కామెంట్స్ చేశారు. ఆస్కార్ జ్యూరీ లో కూడా లాబీయింగ్ జరుగుతుందని, జ్యూరీ సభ్యులు ఒక మూవీ చూడాలంటే చాలా తతంగం నడుస్తుందని, ప్రమాణాలు పాటిస్తూ మూవీస్ ను అవార్డ్స్ కు జ్యూరీ ఎంపిక చేస్తుందని ప్రపంచం నమ్ముతుందని, గతంలో ఆస్కార్ అవార్డ్స్ సాధించిన చాలా సినిమాలు తనకు నచ్చలేదని కామెంట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.