కింగ్ నాగార్జున, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన శివమణి సినిమా గుర్తుండే ఉంటది కదా. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. నాపేరు శివమణి నాకు కొంచెం మెంటల్.. అనే డైలాగ్ అప్పట్లో చాలా ఫేమస్. ఇప్పుడు సినిమా గురించి టాపిక్ ఎందుకొచ్చింది అంటే.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాను గుర్తుచేసుకున్నాడు కింగ్ నాగార్జున. అసలు సంగతేంటంటే..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ప్రపంచం కరోనా వల్ల వణికిపోతున్న సంగతి తెలిసిందే కదా. ఇక కరోనాపై అవగాహన పెంచేందుకు ఇప్పటికే పలువురు పలు వీడియోలు చేసిన ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఇక తాజాగా మిమిక్రి ఆర్టిస్ట్ బవిరి రవి శివమణి సినిమాలోని ఒక సన్నివేశాన్ని తీసుకుకొని కరోనా కు కనెక్ట్ చేసి వీడియో చేసాడు. శివమణి సినిమాలో పూర్ణా మార్కెట్‌లో నాగార్జున చెప్పిన డైలాగులు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుకొస్తుంటాయి. అదే సన్నివేశాన్ని తీసుకొని.. ‘నా పేరు శివమణి.. నాకు కొంచం మెంటల్.. ఇప్పటివరకు మాస్కులు లేకుండా ఎందుకు తిరిగారో నేను అడగ.. సడన్‌గా కరోనా వచ్చింది మాస్కులు వేసుకోండి అంటే కష్టంగానే ఉంటది.. బయట తిరగొద్దని, మోడీ మాట వినాలని నాగార్జున మిమిక్రి వాయిస్ తో పోలీస్ గా నాగార్జున ప్రజలకు వార్నింగ్ ఇస్తున్నట్లు పేరడీ వీడియో చేసాడు. ఇక ఈ వీడియో ను నాగ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయడమే కాకుండా పూరీ శివమణి మూవీ ఈ టైం లో చేస్తే పూరి డైలాగ్స్ ఇలానే ఉండేవని కామెంట్ కూడా పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
If I did the movie Shivamani now,@purijagan s dialogues would be somewhat like this in #CoronavirusCrisis pic.twitter.com/KrFiii8Ug2
— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 25, 2020




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

























