ఒక సినిమా అందరికీ నచ్చాలని లేదు. కొంతమందికి నచ్చితే.. అదే సినిమా ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు. ఎవరి సొంత అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి. అలా దర్శక ధీరుడు రాజమౌళికి తన ఒపీనియన్ ను చెప్పడం ఇప్పుడు తప్పయింది కొంతమంది నెటిజన్స్ కు. అసలు సంగతేంటంటే… ఆస్కార్ అవార్డ్ పొందిన పారాసైట్ చిత్రం చూసిన రాజమౌళి దానిపై కాస్త వెటకారంగానే కామెంట్స్ చేశాడు. ఆ సినిమా చూస్తున్నంత సేపు బోరింగ్ ఫీలింగ్ కలిగిందని, చూస్తూ అలానే పడుకుండిపోయానని చెప్పుకొచ్చారు. అంతేకాదు నాకు స్లోగా ఉండే సినిమాలు నచ్చవని కామెంట్స్ చేశారు. ఇక అంతే ఇది చూసిన కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ మీద కామెంట్స్ వదిలారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రాజమౌళి ఆస్కార్ అవార్డు సాధించిన సినిమా గురించి అలా మాట్లాడటం కరెక్ట్ఏ కాదని…ఏ సినిమా అయినా మొత్తం చూశాకే కామెంట్ చేయాలని నెటిజన్స్ విమర్శించారు. ఇక ఈ విమర్శలకు రాజమౌళి కూడా కోపమొచ్చినట్టుంది… రివర్స్ లో కౌంటర్ ఇచ్చాడు. ‘పారసైట్’ నచ్చకపోవడమనేది నా పర్సనల్ ఒపీనియన్.. అయినా ఆస్కార్ జ్యూరీలో కూడా లాబీయింగ్ జరుగుతుంది..ఓ సినిమా జ్యూరీ సభ్యులు చూడాలంటే చాలా తతంగమే నడుస్తుంది.. అయినా సరే జ్యూరీ ప్రమాణాల్ని పాటిస్తుంటుందని ప్రపంచం మొత్తం నమ్ముతుంది. .నాకు గతంలోనూ ఆస్కార్ సాధించిన చాలా సినిమాలు నచ్చలేదని చెప్పాడు. మరి ఈ వ్యవహారం ఇక్కడితో ఆగుతుందో లేదో చూద్దాం.
బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు.ఇంకా కొద్దిరోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది అనుకునే లోపు కరోనా వల్ల మరో పెద్ద బ్రేక్ వచ్చింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: